STOCKS

News


‘డొనేట్‌కార్ట్‌’కు రూ.2.55 కోట్ల సీడ్‌ ఫండ్‌

Thursday 7th March 2019
Markets_main1551936954.png-24464

- లెట్స్‌ వెంచర్‌, ఏంజెల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడి
రాయదుర్గం: ఆన్‌లైన్‌ డొనేషన్‌ ప్లాట్‌ఫామ్‌గా టీ-హబ్‌లో ఊపిరి పోసుకున్న ‘డొనేట్‌కార్ట్‌’కు రూ.2.55 కోట్ల సీడ్‌ ఫండింగ్‌ లభించింది. లెట్స్‌ వెంచర్, ఇతర ఏంజెల్‌ ఇన్వెస్టర్ల ద్వారా ఈ సీడ్‌ ఫండింగ్‌ లభించినట్లు డొనేట్‌కార్ట్‌ వ్యవస్థాపకులు అనిల్‌ కుమార్‌రెడ్డి, సందీప్‌ శర్మ చెప్పారు. ఈ నిధులతో టెక్నాలజీని, టీమ్‌ను మరింత మెరుగుపర్చుకుంటామని వారు చెప్పారు. వీరిద్దరూ ఎన్‌ఐటి నాగ్‌పూర్‌లో చదువుకుని, 2016లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. చెన్నయ్‌లో వరదల సందర్భంగా నెల రోజులపాటు వాలంటీర్‌గా పనిచేయటం ఈ స్టార్టప్‌ దిశగా తమను ప్రేరేపించిందని వారు చెప్పారు. డొనేట్‌కార్ట్‌ సంస్థ గడిచిన రెండున్నరేళ్లలో 30వేల మంది నుంచి రూ.5 కోట్ల విరాళాలను సేకరించింది. వాటిని 500 స్వచ్ఛంద సంస్థల ద్వారా అవసరార్థులకు పంపిణీ చేసింది. వచ్చే మూడేళ్ళలో రూ.100 కోట్ల విరాళాలను సేకరించి, అవసరార్థులకు అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అనిల్‌ కుమార్‌ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. 



You may be interested

నెట్‌ యూజర్లు ఎట్‌ 63 కోట్లు!

Thursday 7th March 2019

- గ్రామాల్లోనూ ఇంటర్నెట్‌ జోరు  - ఫోన్‌ ద్వారానే ఎక్కువ మంది వాడకం - వాడేవారిలో 42 శాతం మంది మహిళలే  - కాంటర్‌ ఐఎమ్‌ఆర్‌బీఐ తాజా నివేదిక వెల్లడి ముంబై: భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇంటర్నెట్‌ వాడకందారుల సంఖ్య రెండంకెల వృద్ధితో  63 కోట్లకు పెరగగలదని కాంటర్‌ ఐఎమ్‌ఆర్‌బీ సంస్థ అంచనా వేసింది. గ్రామాల్లో ఇంటర్నెట్‌ వృద్ధి జోరుగా ఉందని, దీంతో నెట్‌ వాడకందారుల సంఖ్య భారీగా

ప్రపంచ వృద్ధి అంచనాలకు కోత

Thursday 7th March 2019

3.3 శాతానికి తగ్గించిన ఓఈసీడీ వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్‌ అనిశ్చితుల వల్లే పారిస్‌: వాణిజ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, బ్రెగ్జిట్‌ తదితర అంశాలు ప్రపంచ వృద్ధిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక సహకార - అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పేర్కొంది. ఈ నేపథ్యంలో 2019 సంవత్సరానికి ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాలను గత నవంబర్‌లో పేర్కొన్న 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించింది. అంతకుముందు అంచనాలు 3.7 శాతంతో పోలిస్తే మరింత

Most from this category