STOCKS

News


జెట్‌కు ఐబీసీ వెలుపలే పరిష్కారం

Monday 22nd April 2019
news_main1555916270.png-25263

రుణదాతల యోచన
బిడ్డింగ్‌ విజయవంతం అవుతుందన్న ఆశాభావం

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ సఫలం కాకపోతే, ఈ సమస్యను ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ)కు వెలుపలే పరిష్కరించుకోవాలన్న యోచనతో బ్యాంకులు ఉన్నాయి. జెట్‌కు రూ.8,500 కోట్లకు పైగా రుణాలు ఇచ్చి, వాటి వసూలు కోసం సంస్థను ఆధీనంలోకి తీసుకున్న ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ... సంస్థను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. సంస్థకు అత్యవసంగా అవసరమైన నిధులను సైతం సమకూర్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో మొత్తం కార్యకలాపాలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బిడ్డింగ్‌ ప్రక్రియ విజయవంతం అవుతుందని బ్యాంకులు ఎంతో ఆశతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ బిడ్డింగ్‌ ప్రక్రియ సఫలం కాకపోతే ప్లాన్‌బి (ఐబీసీ వెలుపల పరిష్కారం) దిశగా పనిచేయనున్నట్టు పేర్కొన్నాయి. ఐబీసీ కింద అయితే పరిష్కారానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం అవసరం. పైగా ఈ ప్రక్రియ మార్కెట్‌ స్పందనపై ఆధారపడి, సమయం తీసుకుంటుంది. జెట్‌ఎయిర్‌వేస్‌కు ఉన్న విమానాలు, ఇతర ఆస్తులను విక్రయించడమే ప్లాన్‌ బిగా పేర్కొన్నాయి. ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌, టీపీజీ క్యాపిటల్‌, ఇండిగో పార్ట్‌నర్స్‌, నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటాల పట్ల ఆసక్తి ప్రదర్శించినట్టు సమాచారం. అయితే, బిడ్డర్ల సమాచారం మే 10న అధికారికంగా తెలియనుంది. 
ప్రైవేటీకరణ పరిష్కారం కాదు: ఏఐ ఉద్యోగులు
ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని ఎయిర్‌ ఇండియా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రైవేటు రంగంలోని జెట్‌ ఎయిర్‌వేస్‌, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మూతపడిన ఘటనలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొంది. ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తన ప్రణాళికలపై తక్షణమే పునరాలోచన చేయాలని ఎయిర్‌ కార్పొరేషన్‌ ఎం‍ప్లాయీస్‌ యూనియన్‌ (ఏసీఈయూ) సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. జెట్‌ఎయిర్‌వేస్‌ 20,000 మంది ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడుతూ... ప్రభుత్వ విధానాలు విమానయాన పరిశ్రమలో సంక్షోభానికి, ఉద్యోగాల నష్టానికి కారణమవుతున్న నేపథ్యంలో వీటిపై పునఃపరిశీలన అవసరమని సూచించారు. ‘‘మొదట కింగ్‌ఫిషర్‌, ఇప్పుడు జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ప్రైవేటీకరణ కార్యకమ్రం వల్ల అర్థం చేసుకోవాల్సినది ఏమంటే... జాతీయీకరణను తొలగించడం ఒక్కటే లాభాలు, సామర్థ్యాన్ని తెచ్చిపెట్టలేవు’’అని ఆ అధికారి పేర్కొన్నారు. 2040 నాటికి విమాన ప్రయాణికుల సంఖ్యను 110 కోట్లకు చేర్చాలన్న లక్ష్యం విషయంలో ప్రైవేటు రంగంపై ఆధారపడడమే ఈ ససంక్షోభానికి కారణంగా అభివర్ణించారు. 
జెట్‌ఎయిర్‌వేస్‌ ఆగిపోవడం ఓ స్కామ్‌: ఆనంద్‌శర్మ
జెట్‌ఎయిర్‌వేస్‌ కూలిపోవడం ఓ స్కామ్‌గా కనిపిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ నేత ఆనంద్‌శర్మ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇది చోటు చేసుకోవడంతో ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇదో పెద్ద స్కామ్‌గా నాకు అనిపిస్తోంది. ఎన్నికల సమయంలో దీన్ని అమలు చేశారు. దీంతో ఎవరూ ప్రశ్నించరు’’ అని శర్మ అన్నారు. కేంద్రం కాపాడుతున్న ఇతర వ్యాపారాలతో పోలిస్తే జెట్‌ రుణ భారం తక్కువేనన్నారు. ఎయిర్‌లైన్స్‌కు కావాల్సిన అత్యవసర నిధులను అందించేందుకు రుణదాతల కమిటీ తిరస్కరించడంపై సందేహాలు వ్యక్తం చేశారు. You may be interested

పోస్టాఫీసుల ఆధునీకరణ పూర్తి

Monday 22nd April 2019

- ఐటీ దిగ్గజం టీసీఎస్ వెల్లడి న్యూఢిల్లీ: మరిన్ని సేవలు, మరింత మెరుగ్గా అందించేలా దేశవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల పైచిలుకు పోస్టాఫీసుల ఆధునీకరణ ప్రక్రియ పూర్తయినట్లు ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) వెల్లడించింది. ఇండియా పోస్ట్ నుంచి 2013లో దక్కించుకున్న కాంట్రాక్టులో భాగంగా దీన్ని పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ డీల్‌ విలువ రూ. 1,100 కోట్లు. కాంట్రాక్టు ప్రకారం.. మానవ వనరులు, ఫైనాన్స్‌, అకౌంటింగ్‌

పెద్దల సంరక్షణకు వన్‌ బిగ్‌ ఫ్యామిలీ యాప్‌

Monday 22nd April 2019

హైదరాబాద్‌: పెద్దల సంరక్షణకు ఉద్దేశించిన ‘వన్‌ బిగ్‌ ఫ్యామిలీ’యాప్‌ను వెస్కో టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ విడుదల చేసింది. లొకేషన్‌ ట్రాకింగ్‌ సర్వీసెస్‌, ట్రావెల్‌ ప్రణాళికలు, మెడికల్‌ హిస్టరీ, కుటుంబ సభ్యులు, స్నేహితులను లింక్‌ చేసుకోవడం తదితర ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. యాప్‌ విడుదల సందర్భంగా వన్‌బిగ్‌ ఫ్యామిలీ ఇన్వెస్టర్‌ మాధవ్‌ రెడ్డి యాతం మాట్లాడుతూ... తమ తల్లిదండ్రులు ఎక్కుడ ఉన్నా, వారి కోసం వివిధ రకాల సేవలను అందించేందుకు,

Most from this category