STOCKS

News


యూపీఎస్సీ ప్రిపరేషన్‌ చాలా ఈజీ!

Saturday 20th April 2019
Markets_main1555739438.png-25242

- వీడియో పాఠాలు అందిస్తున్న లెర్నింగ్‌ స్పేస్‌
- 12 వేల మంది యూజర్లు; 25 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే
- త్వరలోనే రూ.7 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
- ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ వెంకటేశ్వర రావు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 1990 యూపీఎస్సీ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షలో 72వ ర్యాంక్‌. మంచి హోదాలో ఇండియన్‌ రైల్వే సర్వీసెస్‌లో  (ఐఆర్‌ఎస్‌) ఉద్యోగం. ఇల్లు, పెళ్లి, పిల్లలు.. అంతా బాగానే ఉంది. కానీ, ఏదో అసంతృప్తి. అంతే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధులను చేసే స్టార్టప్‌ పెట్టేశాడు! అతనే జీవీ రావు. స్టార్టప్‌ లెర్నింగ్‌ స్పేస్‌ డిజిటల్‌! పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘మాది కృష్ణా జిల్లా. చిన్నప్పటి నుంచి చదువు చెప్పడమంటే ఇష్టం. దీంతో 2012లో ఉద్యోగానికి రాజీనామా చేసి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తపన పడే నిరుపేదల్ని ఈజీగా పరీక్షలకు సన్నద్ధులను చేయాలనుకున్నా. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని చేరుకోవాలంటే ఆన్‌లైనే సరైన వేదికని 2015లో యూపీఎస్సీ సబ్జెక్ట్స్‌ వీడియో పాఠాలను యూట్యూబ్‌లో పెట్టడం ఆరంభించా. చాలా మంది విద్యార్థులు ఫాలో అవుతుండటంతో దీన్నే వ్యాపార వేదిక మార్చాలని నిర్ణయించుకొని.. 2017 ఏప్రిల్‌లో విజయవాడ కేంద్రంగా రూ.50 లక్షల పెట్టుబడితో లెర్నింగ్‌ స్పేస్‌ డిజిటల్‌.కామ్‌ను ప్రారంభించా.
ప్రస్తుతం యూపీఎస్సీకి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్‌ వీడియో, ఆడియో పాఠాలున్నాయి. మాక్‌ టెస్ట్‌లు, క్వశ్చన్‌ బ్యాంక్స్‌ వంటివన్నీ ఉంటాయి. సుమారు 5 వేలకు పైగా వీడియో లెసెన్స్‌ ఉన్నాయి. ధరలు మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌కు రూ.3500, 6 నెలలకు రూ.5 వేలు, ఏడాదికి రూ.7 వేలుంటుంది. ఏడాదిలో బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ విభాగాల్లోకి విస్తరించనున్నాం. సబ్జెక్ట్స్‌ వీడియోల ప్రిపరేషన్, పీపీటీ, అప్‌లోడింగ్‌ అంతా కూడా విజయవాడ కేంద్రంగానే జరుగుతోంది.
25 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే...
ప్రస్తుతం మాకు 12 వేల పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్లున్నాయి. ఇందులో 25 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే. 10 శాతం హైదరాబాద్‌ వాటా ఉంటుంది. ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక నుంచి ఎక్కువ మంది యూజర్లున్నారు. వచ్చే ఏడాది కాలంలో 25 వేల సబ్‌స్క్రిప్షన్స్‌కు చేరాలని లక్ష్యించాం. 2017–18లో రూ.77 లక్షలు, 2018–19లో రూ.1.50 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయాన్ని లక్ష్యించాం. గత రెండేళ్ల నుంచి 90 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం.
రూ.7 కోట్ల సమీకరణ..
ప్రస్తుతం 20 మంది ఉద్యోగులున్నారు. ఇందులో కోర్‌ సబ్జెక్ట్స్‌ మీద 11 మంది నిపుణులు పనిచేస్తుంటారు. త్వరలోనే దేశంలోని ప్రధాన ఐఐఐటీ, ఐఐఎంల నుంచి సుమారు 25 మంది విద్యార్థులను ఎంపిక చేసుకొని వారితో సబ్జెక్ట్స్‌ను ప్రిపేర్‌ చేయిస్తాం. ఏడాదిలో రూ.7 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి’’ అని జీవీ రావు తెలిపారు.You may be interested

ద్విచక్ర వాహన బీమా సేవల్లోకి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

Saturday 20th April 2019

న్యూఢిల్లీ: టూవీలర్‌ బీమా సేవల్లోకి ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కూడా అడుగుపెట్టింది. భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ భాగస్వామ్యంతో ఈ సేవలను అందించనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 40,000 ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ పాయింట్లు, మైఎయిర్‌టెల్‌ యాప్‌లో ఆకర్షణీయమైన ద్విచక్ర వాహన బీమా ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలియజేసింది. ‘‘వ్యక్తిగత ప్రమాద బీమా, థార్డ్‌ పార్టీ లయబిలిటీ ప్రొటక్షన్‌.. తనిఖీ రహిత, అత్యంత వేగవంతమైన రెన్యువల్‌ వంటి ఆఫర్లు

మే 3 నుంచి ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్యూ

Saturday 20th April 2019

- మే 17న ముగింపు  - రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.25,000 కోట్లు సమీకరణ న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ రైట్స్‌ ఇష్యూ వచ్చే నెల 3న మొదలై 17న ముగుస్తుంది. ఈ రైట్స్‌ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ రూ.25,000 కోట్లు సమీకరించనున్నది. స్ల్పిట్‌ దరఖాస్తు ఫారాలను మే 10లోపు సమర్పించాలని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ రైట్స్‌ ఇష్యూకు అర్హులైన వాటాదారులను గుర్తించడానికి రికార్డ్‌ డేట్‌ను ఈ నెల 24గా

Most from this category