STOCKS

News


కొచర్‌కు క్లీన్‌చిట్‌ చెల్లదన్న ఐసీఐసీఐ బ్యాంకు

Wednesday 24th October 2018
news_main1540360985.png-21435

న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూపునకు రుణం జారీ వెనుక ప్రయోజనం పొందారన్న ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటూ, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో పదవుల నుంచి తప్పుకున్న చందాకొచర్‌ విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆమెపై వచ్చిన బంధుప్రీతి ఆరోపణల్లో ఏ మాత్రం సత్యం లేదంటూ 2016 డిసెంబర్‌లో క్లీన్‌చిట్‌ ఇచ్చిన న్యాయ సేవల సంస్థ సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌, తన నివేదికను ఉపసంహరించుకున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. ఈ విచారణ నివేదికను ఆధారంగా చేసుకునే ఈ ఏడాది మార్చిలో చందాకొచర్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తాము క్లీన్‌చిట్‌ ఇచ్చామని... అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ తన నివేదికను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో అదిక చెల్లుబాటు కాదని బ్యాంకు స్పష్టం చేసింది. ప్రజావేగుల నుంచి వచ్చిన తాజా ఆరోపణలు, బ్యాంకుకు లభించిన అదనపు సమాచారం ఆధారంగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బీఎన్‌ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ సంస్థకు తెలియజేయడంతో, గత తమ నివేదిక ఇక ఎంత మాత్రం చెల్లుబాటు కాదని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు ఐసీఐసీఐ బ్యాంకు పేర్కొంది. 



You may be interested

షేర్‌ఖాన్‌ దిపావళీ స్టాక్స్‌

Wednesday 24th October 2018

దీపావళి వస్తోందంటే ప్రముఖ బోకరేజీ సంస్థల నుంచి స్టాక్స్‌ సిఫారసుల మోత మోగిపోతుంటుంది. రానున్న ఏడాది కాలంలో మంచి రాబడులకు అవకాశం ఉన్న స్టాక్స్‌ జాబితాను అవి ప్రకటిస్తుంటాయి. అన్నీ సక్సెస్‌ అవుతాయన్న నమ్మకం అయితే లేదు... కానీ, ఆయా సిఫారసుల్లోని మంచి స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవడం ఇన్వెస్టర్లు చేయాల్సిన అసలైన పని. షేర్‌ఖాన్‌ ఈ సారి అందరికంటే ముందే సంవత్‌ 2075 పేరుతో స్టాక్స్‌ జాబితాను ప్రకటించేసింది. నిజానికి

అంబుజా సిమెంట్‌ ఆకర్షణీయ ఫలితాలు

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: అంబుజా సిమెంట్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌కు సంబంధించి ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించింది. నికర లాభం 12.73 శాతం వృద్ధితో రూ.396 కోట్లు, ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.6,097 కోట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.351 కోట్లు, ఆదాయం రూ.5,451 కోట్లుగా ఉన్నాయి. మొత్తం వ్యయాలు కూడా 12 శాతం పెరిగి రూ.5,540 కోట్లకు చేరాయి. జనవరి-డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరంగా అంబుజా సిమెంట్స్‌

Most from this category