STOCKS

News


మార్కెట్లోకి కొత్త సుజుకీ హయబుసా

Friday 28th December 2018
news_main1545970559.png-23273

  • ధర రూ.13.74 లక్షలు

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌ సైకిల్‌ దేశీ మార్కెట్లో హయబుసా 2019 ఎడిషన్‌ స్పోర్ట్‌‍్స బైక్‌ను గురువారం విడుదల చేసింది. నూతన ఎడిషన్‌లో భారత పరిస్థితులకు అనుగుణంగా సైడ్ రిఫ్లెక్టర్లను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. 1,340 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ ధర రూ.13.74 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూం). విడుదల సందర్భంగా ఎస్‌ఎంఐపీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతోషి ఉచితా మాట్లాడుతూ.. ‘గడిచిన 20 ఏళ్లుగా స్పోర్ట్స్‌ బైక్‌ల విభాగంలో సుజుకి హయబుసాకు భారత్‌లో అద్భుతమైన స్పందన లభిస్తోంది. నూతన ఎడిషన్‌లో భాగంగా విడుదలచేసిన రెండు విభిన్న రంగుల బైక్‌లు ఔత్సాహికులను ఆకట్టుకుంటాయని భావిస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

రూపాయి అప్‌

Friday 28th December 2018

డాలరు బలహీనత కారణంగా ఇతర ఆసియా కరెన్సీలు బలపడిన నేపథ్యంలో రూపాయి సైతం పెరిగింది. శుక్రవారం ముంబైలోని ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సే‍్ఛంజ్‌ మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 26పైసలు పెరిగి 70.02 వద్దకు చేరింది. అమెరికా గవర్నమెంట్‌ షట్‌డవున్‌ ఫలితంగా పలు కరెన్సీలతో పోలిస్తే డాలరు బలహీనపడింది. డాలరు ఇండెక్స్‌ క్రితం రోజు 0.13 శాతం తగ్గుదలతో 96.35 స్థాయికి పడిపోయింది. అలాగే ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధర

తొలి దేశీ ఎలక్ట్రానిక్ చిప్!!

Friday 28th December 2018

పృథ్వీ 3ని రూపొందించిన సాంఖ్య ల్యాబ్స్‌ 5జీ కనెక్షన్లకు, కాల్‌ డ్రాప్స్‌ నియంత్రణలో ఉపయోగం హైదరాబాద్‌: కాల్‌ డ్రాప్స్‌ను నియంత్రించడంతో పాటు 5జీ కనెక్షన్స్‌కు ఉపయోగపడేలా దేశీయంగా తొలి ఎలక్ట్రానిక్ చిప్‌సెట్‌ పృథ్వీ 3ని బెంగళూరుకు చెందిన సాంఖ్య ల్యాబ్స్ రూపొందించింది. మొబైల్ ఫోన్స్‌లో నేరుగా టీవీ ప్రసారాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని డిజైనింగ్‌, అభివృద్ధి పూర్తిగా దేశీయంగానే జరిగినట్లు చిప్‌సెట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా

Most from this category