STOCKS

News


భూషణ్‌ స్టీల్‌ మాకు రూ.900 కోట్లివ్వాలి

Thursday 8th March 2018
news_main1520531420.png-14461

  • వసూలు కోసం ఎన్‌సీఎల్‌టీకి ఎల్‌ అండ్‌ టీ

న్యూఢిల్లీ: నిర్మాణరంగ దిగ్గజ కంపెనీ లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) భూషణ్‌ స్టీల్‌ నుంచి బకాయిల వసూలు కోసం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) ఆశ్రయించింది. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న భూషణ్‌ స్టీల్‌ నుంచి తనకు రావాల్సిన బకాయిలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. క్యాపిటల్‌ గూడ్స్‌ను సరఫరా చేసినందుకు సంస్థ నుంచి తమకు రూ.900 కోట్లు రావాల్సి ఉందని ఎల్‌ అండ్‌ టీ న్యాయవాది ట్రైబ్యునల్‌ను కోరారు. తమను సెక్యూర్డ్‌ క్రెడిటర్‌గా గుర్తించాలని కోరారు. దీనిపై అభిప్రాయం తెలియజేయాలని దివాలా పరిష్కార నిపుణులను ట్రిబ్యునల్‌ ఆదేశించింది. భూషణ్‌ స్టీల్‌లో నియంత్రిత వాటా కొనుగోలుకు తాము అధిక బిడ్డర్‌గా నిలిచినట్టు టాటా స్టీల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం గమనార్హం. 

భూషణ్ స్టీల్ చైర్మన్‌ని ప్రశ్నించిన ఎస్‌ఎఫ్‌ఐవో
దాదాపు రూ. 1,000 కోట్ల నిధుల స్వాహా ఆరోపణలకు సంబంధించి భూషణ్ స్టీల్ చైర్మన్ బ్రిజ్ భూషణ్ సింఘాల్‌ని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో) గురువారం ప్రశ్నించింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖలో భాగమైన ఎస్‌ఎఫ్‌ఐవో గతేడాది నుంచి కంపెనీలో నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణ జరుపుతోంది. భూషణ్ స్టీల్ దాదాపు రూ. 44,000 కోట్ల మేర బ్యాంకులకు బాకీ పడింది. మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన 12 కంపెనీలపై దివాలా చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించిన సంస్థల్లో ఇది కూడా ఉంది. 



You may be interested

ఫిబ్రవరిలో తగ్గిన ఫండ్ల ఆస్తులు

Thursday 8th March 2018

 అరకొరగానే ఫండ్లలో పెట్టుబడులు   డెట్‌ ఫండ్ల నుంచి ఉపసంహరణ: యాంఫీ న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్ల ఆస్తులు గత నెలలో రూ.21,000 కోట్ల మేర తగ్గాయి. డెట్‌ సెగ్మెంట్‌ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవటం, ఫండ్లలో పెట్టుబడులు తగ్గడం వంటి కారణాల వల్ల ఈ ఏడాది  ఫిబ్రవరిలో ఈ స్థాయిలో మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎమ్‌) తగ్గాయని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా(యాంఫి) తెలియజేసింది. యాంఫీ తాజా గణాంకాల ప్రకారం..,   భారత్‌లో కార్యకలాపాలు

భారత్‌లో మాక్సిస్‌ టైర్స్‌ తొలి ప్లాంటు

Thursday 8th March 2018

 రూ.2,640 కోట్లతో గుజరాత్‌లో ఏర్పాటు సనంద్‌: తైవాన్‌కు చెందిన మాక్సిస్‌ టైర్స్‌ అనుబంధ సం‍స్థ ‘మాక్సిస్‌ రబ్బర్‌ ఇండియా’ తాజాగా భారత్‌లో తన తొలి మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంటును ప్రారంభించింది. రూ.2,640 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో గుజరాత్‌లోని సనంద్‌లో ఈ ప్లాంటు ఏర్పాటు చేసింది. ప్లాంటులో రోజుకు 20,000 టూవీలర్‌ టైర్లను, 40,000 ట్యూబ్స్‌ను తయారు చేయవచ్చని కంపెనీ అధికార ప్రతినిధి జియా సియోవో లియు తెలిపారు. 106 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ

Most from this category