STOCKS

News


ఐటీలో భద్రతా వ్యవస్థ లేమి..!

Thursday 13th September 2018
news_main1536814115.png-20223

న్యూఢిల్లీ: ధృడమైన భద్రతా వ్యవస్థ లేకపోవడం వల్లే భారత ఐటీ సంస్థలపై సైబర్ దాడులు పెరుగుతున్నట్లు వెల్లడయింది. ప్రమాద, సమగ్ర నిర్వహణ సంస్థ నేత్రికా కన్సల్టెంగ్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. తాము సర్వే చేపట్టిన కంపెనీలలో 65 శాతం సైబర్ దాడులకు బలమైన భద్రతా వ్యవస్థ లేకపోవడమే కారణమని తేలినట్లు ఈ సంస్థ వెల్లడించింది. 18 శాతం కంపెనీలు మాత్రమే 25 మందికి మించిన నిపుణులతో భద్రతా వ్యవస్థలను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. గడిచిన 12 నెలల్లో సైబర్ దాడులకు గురైన కంపెనీలలో వైరెస్‌ దాడులు 7 శాతం, మాల్‌వేర్‌ 10 శాతం, ఫిషింగ్ 19 శాతం, రాన్‌సమ్‌ వేర్‌ దాడులు 26 శాతం నమోదైనట్లు వివరించింది.



You may be interested

రూపాయి @ 100!!

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: రూపాయి విలువ పతనం మరింతగా కొనసాగుతుందని, వచ్చే పదేళ్లలో ఏకంగా 100కి కూడా పడిపోయే అవకాశం ఉందని ప్రముఖ ఇన్వెస్టరు మార్క్‌ ఫేబర్‌ అంచనా వేశారు. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుత రూపాయి పతనానికి ఇతర ఆసియా కరెన్సీల క్షీణతతో పాటు భారత ద్రవ్య పరపతి విధానం కూడా కారణమని ఆయన చెప్పారు. భారత్‌లో కఠినతర పరపతి విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో చాలా మంది..

టెక్నాలజీపై అతిగా ఆధారపడొద్దు..

Thursday 13th September 2018

ముంబై: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాల మంజూరీలో టెక్నాలజీపై అతిగా ఆధారపడరాదని, ఉద్యోగులు వివేచనతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చీ పేర్కొన్నారు. దరఖాస్తుదారు అర్హతలను మదింపు చేసే విషయంలో కంప్యూటర్ ఆల్గోరిథమ్స్‌, క్రెడిట్ బ్యూరోలిచ్చే స్కోర్లు, సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ మొదలైన వాటిపై మరీ ఎక్కువగా ఆధారపడకూడదని ఆయన సూచించారు. వీటిని తారుమారు చేసే అవకాశాలూ ఉన్నాయన్నారు.

Most from this category