News


వ్యాపార పద్మశ్రీలు వీరే..!

Saturday 26th January 2019
news_main1548488895.png-23817

అనిల్‌ మణిభాయ్‌ నాయక్‌... ఇది మౌలిక సదుపాయాల రంగానికి చెందిన విఖ్యాత కంపెనీ ఎల్‌అండ్‌టీ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఏఎం నాయక్‌ (77) పూర్తి పేరు. ఎల్‌అండ్‌టీ కంపెనీలో 1965 మార్చి 15న జూనియర్‌ ఇంజనీర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఆ సంస్థను నడిపించే స్థాయికి చేరుకుని... ఉక్కులాంటి కంపెనీగా తీర్చిదిద్దారు. కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా, ఐటీ సేవలు, ఆర్థిక సేవల్లోకీ విస్తరింపజేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ అవార్డును ప్రకటించింది. నాయక్‌ గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వారు. బిర్లా విశ్వకర్మ మహావిద్యాలయ ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. అనంతరం తన తండ్రి ఇచ్చిన లేఖతో ముంబైకి వెళ్లి ముకంద్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ వర్క్స్‌లో పనిచేసే వీరేన్‌ జే షాను కలిశారు. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం లేకపోవడంతో, మెరుగుపరచుకోవాలని అక్కడి కంపెనీ మేనేజర్‌ నుంచి సలహా వచ్చింది. దాంతో ఆయన ఇంగ్లిష్‌ సామర్థ్యాలను పెంచుకునే పనిలో పడ్డారు. నెస్టర్‌ బాయిలర్స్‌లో తొలుత చేరారు. యాజమాన్యం మారడంతో ఉపాధి కోల్పోయారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 1965 మార్చి 15న ఎల్‌అండ్‌టీలో జూనియర్‌ ఇంజనీర్‌గా చేరారు. 1986లో జనరల్‌ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. 1999లో ఏకంగా సంస్థ సీఈవో, ఎండీగా పగ్గాలు చేపట్టారు. 2003లో చైర్మన్‌ అయ్యారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, అహ్మదాబాద్‌కు సైతం చైర్మన్‌గా పనిచేశారు.

 



You may be interested

ఐదో ఆర్థిక శక్తిగా భారత్‌

Saturday 26th January 2019

- ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన - పెట్టుబడుల పురోగతికి నిరంతర చర్యలు - భారత్‌-దక్షిణాఫ్రికా వ్యాపార సదస్సులో ప్రసంగం న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశంలో పెట్టుబడుల పురోగతికి నిరంతర చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందనీ ఆయన వివరించారు. ఇండస్ట్రీ చాంబర్‌- సీఐఐ నిర్వహించిన భారత్‌-దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సును ఉద్దేశించి శుక్రవారం  ప్రధాని చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... - భారత్‌ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.

మారుతీ లాభం 17శాతం డౌన్‌..!

Saturday 26th January 2019

రూ. 1,489 కోట్లుగా నమోదు ఒక త్రైమాసికంలో ఇంత క్షీణత అయిదేళ్లలో ఇదే తొలిసారి- తగ్గిన అమ్మకాలు, ముడివస్తువుల ధరల పెరుగుదల కారణం న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం (ఎంఎస్‌ఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండో త్రైమాసికంలో కూడా క్షీణించింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో 10 శాతం క్షీణత నమోదు చేసిన మారుతీ తాజాగా డిసెంబర్‌ క్వార్టర్‌లోనూ అదే తీరు కొనసాగించింది. అక్టోబర్‌-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర

Most from this category