STOCKS

News


అత్యుత్తమ కంపెనీ... ‘ఎల్‌ అండ్‌ టీ’

Wednesday 17th October 2018
news_main1539750087.png-21222

ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,000 ‘బెస్ట్‌ గ్లోబల్‌ ఎంప్లాయర్స్‌’ కంపెనీల జాబితాను ఫోర్బ్స్‌ రూపొందించగా... దేశీ మౌలిక రంగ దిగ్గజం లార్సెన్ టూబ్రో (ఎల్ అండ్ టీ) ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచింది. 2018 ఏడాదికి రూపొందించిన జాబితాలో మొత్తం 4,30,000 కంపెనీలను పరిశీలించిన ఫోర్బ్స్.. వీటిలో అత్యంత ఉత్తమమైన ఎంప్లాయర్స్‌గా 2వేల కంపెనీలను ఎంపికచేసింది. ఈ జాబితాలో వందలోపు ర్యాంకులను పొందిన భారత కంపెనీలలో ఎల్ అండ్ టీ 22వ స్థానంలో నిలవగా.. మహీంద్రా అండ్ మహీంద్ర (55)వ స్థానం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ (59), హెచ్‌డీఎఫ్‌సీ (91)వ స్థానాల్లో నిలిచాయి. మొత్తం 24 దేశీ కంపెనీలకు జాబితాలో స్థానం దక్కింది. వంద తరువాత స్థానాల్లో వరుసగా.. ప్రభుత్వ రంగ సంస్థ జీఐసీ (106), ఐటీసీ (108), సెయిల్‌ (139), సన్‌ ఫార్మా (172), ఏషియన్‌ పెయింట్స్‌ (179), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (183), అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ (201), జెఎస్‌డబ్ల్యూ స్టీల్ (207), కోటక్ మహీంద్రా బ్యాంక్ (253), హీరో మోటోకార్ప్ (295), టెక్ మహీంద్రా (351), ఐసీఐసీఐ బ్యాంక్ (359), విప్రో (362), హిందాల్కో (378), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (381), బజాజ్ ఆటో (417), టాటా మోటార్స్ (437), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (479), యాక్సిస్ బ్యాంక్ (481), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (489) స్థానంలో నిలిచాయి. 
టాప్‌ 10లో ఆరు అమెరికావే!!
జాబితాలోని మొదటి 10 కంపెనీలలో ఆరు అమెరికన్‌ కంపెనీలు ఉండగా.. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ టాప్‌ వన్‌లో నిలిచింది. మైక్రోసాఫ్ట్‌ 2వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆపిల్‌ (3), వాల్ట్‌ డిస్నీ (4), అమెజాన్‌ (5), సెల్‌జీన్ కార్పొరేషన్ 9వ స్థానంలో నిలిచాయి. తొలి 500 కంపెనీలలో 185 యూఎస్‌ సంస్థలు ఉండగా.. ఆ తరువాత అత్యధిక కంపెనీలు జర్మనీవే. టాప్‌ టెన్‌లో సైతం జర్మనీకి చెందిన ఆటో దిగ్గజం దైమ్లర్‌ (7), బీఎండబ్ల్యూ (10) నిలిచాయి. ఇక ఈ జాబితాలో చైనా, హాంగ్‌కాంగ్‌కు చెందినవి 80 కంపెనీలున్నాయి.



You may be interested

వెల్త్‌ అడ్వైజర్స్‌ను కొనుగోలు చేస్తున్న ఐఐఎఫ్‌ఎల్‌

Wednesday 17th October 2018

ముంబై: చెన్నై కేంద్రంగా పెట్టుబడి సలహా, సేవలు అందించే ‘వెల్త్‌ అడ్వైజర్స్‌’ను ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.235 కోట్లు వెచ్చించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ కొనుగోలుతో దక్షిణాదిన విస్తరించేందుకు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌కు వీలు కలుగుతుంది. ‘‘ఈ కొనుగోలు ద్వారా విక్రయాలు, ఇతర విభాగాల్లో ప్రతిభావంతులైన సిబ్బంది మాకు అందుబాటులోకి వస్తారు. దీనికి తోడు మా ఉమ్మడి కృషితో హై నెట్‌ వర్త్‌ (అధిక విలువ

బ్యాంకింగ్ మోసాలపై సీవీసీ అధ్యయనం

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో టాప్‌ 100 బ్యాంకింగ్‌ మోసాలపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) అధ్యయనం చేసింది. మోసాలు జరుగుతున్న తీరు, రుణ పరిమాణం, లోటుపాట్లు తదితర అంశాలను విశ్లేషించింది. వ్యవస్థలో లోపాలు సరిదిద్దేందుకు తీసుకోతగిన చర్యలు సిఫార్సు చేసింది. సీవీసీ ఈ తరహా అధ్యయనం నిర్వహించడం ఇదే ప్రథమం. ఈ నివేదికను రిజర్వ్‌ బ్యాంక్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సీబీఐ తదితర నియంత్రణ సంస్థలు, దర్యాప్తు సంస్థలకు

Most from this category