STOCKS

News


మే14న మైండ్‌ట్రీ- ఎల్‌అండ్‌టీ ఓపెన్‌ఆఫర్‌ ఆరంభం

Tuesday 26th March 2019
news_main1553596562.png-24808

మైండ్‌ట్రీలో అదనంగా 31 శాతం వాటా కొనేందుకు ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌ మే 14న ఆరంభమవుతుందని ఎల్‌అండ్‌టీ ప్రకటించింది. ఈ ఆఫర్‌ మే 27న ముగుస్తుందని వాటాదారులకు తెలియజేసింది. ఓపెన్‌ ఆఫర్‌లో 5.13 కోట్ల షేర్లను రూ. 5030 కోట్లకు సొంతం చేసుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ముందుగా ప్రకటించినట్లే ఓపెన్‌ఆఫర్‌ ధర రూ. 980గా నిర్ణయించింది. అయితే మే 13లోపు ఈ ధర, ఆఫర్‌ సైజును మార్చేందుకు ఎల్‌అండ్‌టీకి అవకాశం ఉంది. ఆఫర్‌లో పాల్గొనే విషయమై వాటాదారులకు సలహా ఇచ్చేందుకు మైండ్‌ట్రీ స్వతంత్ర డైరెక్టర్లకు మే 10 వరకు గడువుంది. ఓపెన్‌ ఆఫర్‌ ముసాయిదాను ఎల్‌అండ్‌టీ ఏప్రిల్‌2 నాటికి సెబి వద్ద దఖలు చేయనుంది. ఇందుకు పోటీగా ఏదైనా ఆఫర్‌ను ఎవరైనా ప్రకటించదలిస్తే ఏప్రిల్‌ 16లోపు ప్రకటించాల్సిఉంటుంది. ఈ ఓపెన్‌ ఆఫర్‌కు సిటిగ్రూప్‌, యాక్సిస్‌ బ్యాంకులు మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

మైండ్‌ట్రీలో బడా వాటాదారు వీజీ సిద్ధార్ధ నుంచి షేరు ఒక్కింటికి రూ. 980 చొప్పున మైండ్‌ట్రీలో 20.15 శాతం వాటాను ఎల్‌అండ్‌టీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. స్టాక్‌ఎక్చేంజ్‌ మార్గంలో మరో 15 శాతం వాటాను సొంతం చేసుకోవాలని ఎల్‌అండ్‌టీ ఆలోచన. ఇందుకోసం యాక్సిస్‌ క్యాపిటల్‌ను నియమించింది. ఇది, ఓపెన్‌ ఆఫర్‌ అన్నీ అనుకున్నట్లు పూర్తయితే మైండ్‌ట్రీలో ఎల్‌అండ్‌టీకి 66 శాతం వాటా సొంతమవుతుంది. ఈ కొనుగోలు విషయమై మైండ్‌ట్రీ ప్రమోటర్లకు ఎల్‌అండ్‌టీకి మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. తమ కంపెనీని ఎల్‌అండ్‌టీ బలవంతంగా చేజిక్కించుకుంటోందని ఆరోపిస్తున్న మైండ్‌ట్రీ ప్రమోటర్లు టేకోవర్‌ను అడ్డుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మైండ్‌ట్రీ ప్రస్తుత యాజమాన్యం చేతిలోనే కంపెనీ పగ్గాలుంచుతామని ఎల్‌అండ్‌టీ చెబుతోంది. కంపెనీ కూర్పులో ఎలాంటి మార్పులు చేసే ఉద్దేశం తమకు లేదని నమ్మబలుకుతోంది. మరోపక్క మంగళవారం మైండ్‌ట్రీ బోర్డు సమావేశం కానుంది. 



You may be interested

మల్టీబ్యాగర్లు తగ్గడం మంచిదే!

Tuesday 26th March 2019

కొత్త ఏడాది మరిన్ని మల్టీబ్యాగర్లు తయారవుతాయంటున్న నిపుణులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లో మల్టీబ్యాగర్లు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఒకపక్క ఏడాదిలో సూచీలు దాదాపు 15 శాతం ర్యాలీ జరిపినా, మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ ఇచ్చిన స్టాకుల సంఖ్యమాత్రం గత పదేళ్ల కనిష్టానికి పడిపోయింది. అయితే ఇలా ఒక ఏడాది మల్టీబ్యాగర్ల సంఖ్య తగ్గడం వచ్చే ఏడాది మరిన్ని మల్టీబ్యాగర్లుంటాయనేందుకు సంకేతమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2019-20లో భారీగా మల్టీబ్యాగర్లు తయారవుతాయని కొందరు అంచనా

మళ్లీ 38000 పైకి సెన్సెక్స్‌

Tuesday 26th March 2019

- సెన్సెక్స్‌ 424 పాయింట్ల పరుగు - 129 పాయింట్లు పెరిగిన నిఫ్టీ రెండు రోజులపాటు నష్టాలు చవి చూసిన భారత స్టాక్‌ మార్కెట్లకు మంగళవారం పటిష్టంగా కోలుకున్నాయి.  బ్యాంకింగ్‌, ఆర్థిక, మెటల్‌, ఫార్మా రంగ షేర్లతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 38వేల స్థాయిని, నిఫ్టీ 11450 స్థాయిని తిరిగి అందుకున్నాయి. మార్కెట్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 425 పాయింట్ల లాభంతో 38,233 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు

Most from this category