News


ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ లాభం 66 శాతం అప్‌

Thursday 25th October 2018
news_main1540446016.png-21471

న్యూఢిల్లీ: ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 66 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.338 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.560 కోట్లకు పెరిగిందని ఈ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,610 కోట్ల నుంచి రూ.3,326 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ దీనానాథ్‌ దుబాషీ తెలిపారు. వడ్డీరేట్ల, లిక్విడిటీ ఇబ్బందులేమీ లేవని తెలిపారు. పటిష్టమైన రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, అసెట్‌ లయబిలిటీ మేనేజ్‌మెంట్‌ విధానాలే దీనికి కారణాలని వివరించారు. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ కంపెనీ షేర్‌ 3.6 శాతం లాభంతో రూ.127 వద్ద ముగిసింది. 



You may be interested

‘దిద్దుబాటు చర్యల’ మార్గదర్శకాల్లో మార్పులు!

Thursday 25th October 2018

న్యూఢిల్లీ: ఆర్థికంగా బలహీనంగా ఉన్న బ్యాంకులను చక్కదిద్దడానికి ఉద్దేశించిన ‘దిద్దుబాటు చర్యల’ (పీసీఏ) మార్గదర్శకాల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు, వాటి ఫలితాలను సమీక్షించిన అనంతరం, బ్యాంకింగ్‌ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు ఉంటాయి. కొద్ది వారాల్లో ఇందుకు సంబంధించి

విప్రో లాభం 14 శాతం డౌన్‌

Thursday 25th October 2018

న్యూఢిల్లీ/బెంగళూరు: ఐటీ సేవల దిగ్గజం విప్రో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 14 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.2,192 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,889 కోట్లకు తగ్గింది. సీక్వెన్షియల్‌గా చూస్తే నికర లాభం 10 శాతం తగ్గింది. అయితే కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.13,423 కోట్ల నుంచి 8 శాతం పెరిగి

Most from this category