STOCKS

News


హైదరాబాద్‌లో కొటక్‌ మొబైల్‌ మెడికల్‌ వ్యాన్లు

Saturday 13th October 2018
news_main1539410609.png-21123

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కార్పొరేట్ల సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమంలో భాగంగా కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ హైదరాబాద్‌లో మొబైల్‌ మెడికల్‌ వ్యాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి నిర్వహణ కోసం వోకార్డ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ జాయింట్‌ ఎండీ దీపక్‌ గుప్తా శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 6 మొబైల్‌ వ్యాన్లు అందుబాటులో ఉంటాయని... స్థానిక నివాసితులకు వైద్య సేవలను అందిస్తుందని తెలిపారు. ఒక్కో వ్యాన్‌లో డాక్టర్, ఫార్మాసిస్ట్, ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్, డ్రైవర్‌ ఉంటారని, ఏటా 1.50 లక్షల మంది రోగులకు సేవలందించాలని లక్ష్యించినట్లు తెలిపారు. దేశంలోని 20 రాష్ట్రాల్లో 72 కంపెనీలతో కలిసి సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వోకార్డ్‌ ఫౌండేషన్‌ సీఈఓ డాక్టర్‌ హుజైఫా కోరాకివాలా తెలిపారు. గతేడాది సీఎస్‌ఆర్‌ కోసం రూ.50 కోట్ల నిధులను వెచ్చించామని చెప్పారు. 



You may be interested

రుణం ఇవ్వొచ్చు.. తీసుకోవచ్చు!

Saturday 13th October 2018

సాక్షి, హైదరాబాద్‌: ‘‘శ్రీనివాస్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగి. నెలాఖర్లో వాళ్ల అమ్మాయి మొదటి పుట్టిన రోజొచ్చింది. పార్టీ ఏర్పాట్లకు చేతిలో డబ్బు లేదు. తెలిసిన వాళ్లని అప్పు అడగటానికి మనసొప్పలేదు. పోనీ, బ్యాంక్‌ లోన్‌ కోసం వెళదామా అంటే... అదో పెద్ద ప్రక్రియ. సిబిల్‌ స్కోరు... వగైరాలు చూసి మంజూరు చేయటానికి బోలెడంత సమయం పట్టేస్తుంది. మరేం చేయాలి?’’ ‘‘వెంకటేశ్‌ ఓ ప్రభుత్వ ఉద్యోగి. కొంత కాలం నుంచి పొదుపు

వాణిజ్య వాహనాలపై ఇంధన ధరల ప్రభావం

Saturday 13th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వర్షాభావం, ఇంధన ధరల పెరుగుదల వాణిజ్య వాహనాల మీద ప్రభావం ఉంటుందని.. దీంతో అమ్మకాలు కాస్త నెమ్మదించే అవకాశముందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) మహేశ్‌ కులకర్ణి చెప్పారు. దేశంలో ఏటా 2.20 లక్షల పికప్‌ వాహనాలు విక్రయమవుతున్నాయని.. వీటిల్లో మహీంద్రా వాటా 62 శాతం వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఏటా మహీంద్రా నుంచి 12 వేల వాహనాలను

Most from this category