కోటక్ మహీంద్రా లాభం 21% అప్
By Sakshi

ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. వార్షికంగా చూస్తే కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.1,747 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.1,441 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గ్రూప్ మొత్తం అసెట్స్ క్యూ2 చివరి నాటికి 18 శాతం వృద్ధితో రూ.1,99,382 కోట్లకు పెరిగాయి. క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు ధర ఎన్ఎస్ఈలో 1.12 శాతం క్షీణతతో రూ.1,161 వద్ద ట్రేడవుతోంది.
స్టాండలోన్ పరంగా చూస్తే.. బ్యాంక్ నికర లాభం 14.82 శాతం వృద్ధితో రూ.1,141 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసింలో బ్యాంక్ నికర లాభం రూ.994 కోట్లు. ఈ క్యూ2లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం వార్షికంగా 16.28 శాతం వృద్ధితో రూ.2,689 కోట్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.2,313 కోట్లుగా ఉంది.
నికర వడ్డీ మార్జిన్ 4.2 శాతంగా నమోదయ్యింది. గత క్యూ2లో ఇది 4.4 శాతంగా ఉంది. ఈ క్యూ2లో స్థూల ఎన్పీఏలు 2.15 శాతం ఉన్నాయి. గత (క్యూ1) త్రైమాసికంలో ఇవి 2.17 శాతంగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో 2.47 శాతంగా నమోదయ్యాయి. త్రైమాసికం పరంగా నికర ఎన్పీఏలు 0.86 శాతం నుంచి 0.81 శాతానికి తగ్గాయి.
You may be interested
డాలీఖన్నా పోర్టుఫోలియో రివ్యూ
Wednesday 24th October 2018మిడ్‌క్యాప్ మొగల్‌గా పేరొందిన డాలీఖన్నా సెప్టెంబర్ త్రైమాసికంలో పలు కంపెనీల్లో వాటాలు పెంచుకున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో దాదాపు 50 శాతం వరకు పతనమైన పలు కంపెనీలను ఎంచుకొని డాలీ ఖన్నా వాటాలు కొనుగోళ్లు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం డాలీ పోర్టుఫోలియోలో పలు స్టాకులు పది శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి. క్యు2లో డాలీ ఖన్నా పోర్టుఫోలియోలో వచ్చిన మార్పులు... - ఐఎఫ్బీ ఆగ్రో ఇండస్ట్రీస్, మత్తూట్ క్యాపిటల్, నోసిల్, రాడికో
భారత్‌పై పాజిటివ్: మోబియస్
Wednesday 24th October 2018మోబియస్ క్యాపిటల్ పార్ట్నర్స్ ద్వారా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇన్వెస్ట్మెంట్ గురు ‘మార్క్ మోబియస్’.. భారత్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కారణాలు తెలియజేశారు. ఇండియా ఎందుకంత ప్రత్యేకమో వివరించారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌పై ఎలాంటి అంచనాలను కలిగి ఉన్నారో తెలిపారు. తమ వద్ద కొత్త ఫండ్ ఉందని, దీని ద్వారా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామని, దీనికి కొంత సమయం పట్టొచ్చని పేర్కొన్నారు. ‘భారత్ మార్కెట్లో