STOCKS

News


కోటక్‌ బ్యాంక్‌ లాభంలో 23 శాతం వృద్ధి

Monday 21st January 2019
Markets_main1548065337.png-23705

డిసెంబర్‌ త్రైమాసికంలో కోటక్‌ మహీంద్రా బ్యాంకు రూ. 1291 కోట్ల నికరలాభం నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈ మొత్తం 23 శాతం అధికం. గతేడాది మూడో త్రైమాసికంలో బ్యాంకు రూ. 1053 కోట్ల లాభం నమోదు చేసింది. ప్రస్తుత సమీక్షా కాలంలో బ్యాంకు ఎన్‌ఐఐ(నికర వడ్డీ ఆదాయం) 23 శాతం దూసుకుపోయి రూ. 2939కి చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.20 శాతం నుంచి 4.33 శాతానికి పెరిగాయి. బ్యాంకు స్థూల ఎన్‌ఎపీఏలు రూ. 4130 కోట్ల నుంచి రూ. 4033 కోట్లకు అంటే 2.15 శాతం నుంచి 2.07 శాతానికి, నికర ఎన్‌పీఏలు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1400 కోట్లకు అంటే 0.81 శాతం నుంచి 0.71 శాతానికి తగ్గాయి. అడ్వాన్సులు 23 శాతం పెరిగి రూ. 1.96 లక్షల కోట్లకు చేరాయి. సమీక్షాకాలంలో రూ. 32.3 కోట్ల రైటాఫ్‌లు నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో బ్యాంకు కన్సాలిడేటెడ్‌ లాభం రూ. 1624 నుంచి 1844 కోట్లకు పెరిగింది. బ్యాంకు లాభంలో అనుబంధ విభాగాల వాటా దాదాపు 30 శాతం ఉంది. 
 



You may be interested

10950పైన నిఫ్టీ ముగింపు

Monday 21st January 2019

5వ రోజూ లాభాల ముగింపు కలిసొచ్చిన హెవీవెయిట్‌ షేర్ల ర్యాలీ కార్పొరేట్‌ ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో సోమవారం భారత్‌ మార్కెట్‌ దాదాపు రెండున్నర నెలల గరిష్టస్థాయికి చేరింది. అయితే ట్రేడింగ్‌ ముగింపు సమయంలో జరిగిన లాభాల స్వీకరణ ఫలితంగా గరిష్టస్థాయిల్ని నిలబెట్టుకోలేకపోయినా, వరుసగా ఐదో రోజు లాభాల ముగింపును సూచీలు సాధించాయి. సెన్సెక్స్‌ 192 పాయింట్ల లాభపడి 36,579 వద్ద, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 10,961 వద్ద ముగిసింది.  బ్యాంక్‌

నష్టాల బాటలో అటో షేర్లు

Monday 21st January 2019

మార్కెట్‌ లాభాల ర్యాలీలోనూ అటో షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ గురువారం 1శాతం క్షీణించింది. హీరోమోటర్‌ కార్ప్‌ 3.50శాతం, మారుతి సుజుకీ 2.50శాతం, టాటామోటర్స్‌ 1.50శాతం క్షీణత అటో షేర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు 8,844.80తో పోలిస్తే 1.20శాతం నష్టంతో 8,737.30ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో

Most from this category