STOCKS

News


రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌లో కేకేఆర్‌కు 60 శాతం వాటా

Monday 13th August 2018
news_main1534137752.png-19211

హైదరాబాద్‌: రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఈఈఎల్‌)లో 60 శాతం వాటాను 560 మిలియన్‌ డాలర్లు (రూ.3,808 కోట్లు) వెచ్చించి అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ‘కేకేఆర్‌’ కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఆదివారం ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ కంపెనీ విలువ 925 మిలియన్‌ డాలర్లు (రూ.6,290 కోట్లు) అవుతుంది. మున్సిపల్‌, బయోమెడికల్‌ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల సేకరణ, ప్రాసెస్‌, రవాణా సేవల్లో ఆర్‌ఈఈఎల్‌ సేవలు అందిస్తోంది. అలాగే, పేపర్‌, ప్లాస్టిక్‌, కెమికల్స్‌ రీసైకిల్‌ వ్యాపారంలోనూ ఉంది. చెత్త నుంచి ఇంధన విద్యుత్‌ (పునరుత్పాదక ఇంధన వ్యాపారం) తయారీపైనా కంపెనీ దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 60 ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే, దక్షిణాసియాలోని పలు దేశాలు, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికాలోనూ కార్యకలాపాలను కలిగి ఉంది. కేకేఆర్‌ తన ‘ఆసియా ఫండ్‌-3’ ద్వారా ఆర్‌ఈఈఎల్‌లో ఇన్వెస్ట్‌ చేయనుంది. ఇది ఒకానొక అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడి అవుతుంది. పర్యావరణ పరంగా ఎదుర్కొంటున్న అంశాల పరిష్కారానికి తమ కార్యక్రమాన్ని కేకేఆర్‌ సహకారంతో మరింత ముందుకు తీసుకెళతామని ఆర్‌ఈఈఎల్‌ ఎండీ, సీఈవో ఎం.గౌతంరెడ్డి తెలిపారు. ఆర్‌ఈఈఎల్‌ కార్యకలాపాలు స్వచ్ఛ్‌భారత్‌కు మద్దతునిచ్చేవిగా కేకేఆర్‌ ఇండియా సీఈవో సంజయ్‌నాయర్‌ పేర్కొన్నారు.



You may be interested

స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో అన్నీ చిన్న షేర్లే ఉండవా ?

Monday 13th August 2018

ప్ర: స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో వంద శాతం స్మాల్‌ క్యాప్‌ షేర్లు ఉండవని, కొన్ని లిక్విడ్‌ షేర్లను కూడా ఫండ్‌ మేనేజర్లు కొనుగోలు చేస్తారని విన్నాను. అది నిజమేనా ? ఎందుకలా చేస్తారు. ఫండ్‌ మేనేజర్లు తమ ఫండ్స్‌కు సంబంధించి లిక్విడిటీని ప్రతికూల పరిస్థితుల్లో ఎలా మేనేజ్‌ చేస్తారు ? -శ్రీకాంత్‌, విజయవాడ  జ: లిక్విడిటీ నిర్వహణకు వివిధ రకాలైన పద్ధతులను ఫండ్‌ మేనేజర్లు అనుసరిస్తూ ఉంటారు. దాంట్లో ప్రధానమైనది లిక్విడ్‌(అమ్మకాలు, కొనుగోళ్లు

ఎస్‌బీఐ రూ.2,490 కోట్ల ఎన్‌పీఏల అమ్మకం

Monday 13th August 2018

న్యూఢిల్లీ: బోంబేరేయాన్‌ ఫ్యాషన్స్‌, శివమ్‌ధాతు సంస్థలకు చెందిన వసూలని కాని మొం‍డి రుణాలు (ఎన్‌పీఏలు) రూ.2,490 కోట్లను విక్రయించేందుకు ఎస్‌బీఐ బిడ్లను ఆహ్వానించింది. ఇందులో బోంబే రేయాన్‌ ఫ్యాషన్స్‌ రూ.2,260.79 కోట్లు, శివమ్‌ధాతు ఉద్యోగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సం‍స్థకు చెందిన మొండి బకాయి రూ.229.32 కోట్లు ఉన్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. బోంబే రేయాన్‌ ఫ్యాషన్స్‌లో ఎస్‌బీఐకి 29.28 శాతం ఈక్విటీ వాటా ఉంది. 

Most from this category