STOCKS

News


కేకేఆర్‌ చేతికి రామ్‌కీ ఎన్విరో

Tuesday 12th February 2019
news_main1549948802.png-24142

  • మెజారిటీ 60 శాతం వాటా కొనుగోలు
  • దీనికోసం రూ.3,630 కోట్ల పెట్టుబడి
  • ఈ రంగంలో ఇదే అతిపెద్ద డీల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన పర్యావరణ సేవల సంస్థ రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌లో (ఆర్‌ఈఈఎల్‌) అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం కేకేఆర్‌ 60 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ వాటాల కోసం రూ.3,630 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇదివరలోనే ఈ మేరకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదరగా... ఈ లావాదేవీ ప్రక్రియ సోమవారం పూర్తయినట్లు ఇరు కంపెనీల ప్రతినిధులూ ప్రకటించారు. రామ్‌కీ ఎన్విరోలో ప్రైమరీ, సెకండరీ పెట్టుబడులు కలిపి రూ.3,630 కోట్లను కేకేఆర్‌ ఇన్వెస్ట్‌ చేసింది. గ్లోబల్‌ ఇంపాక్ట్‌ స్ట్రాటజీలో భాగంగా కేకేఆర్‌ ఏసియన్‌ ఫండ్‌–3 నుంచి ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు కేకేఆర్‌ ఎండీ రూపేన్‌ ఝవేరీ తెలియజేశారు. సామాజికంగా, పర్యావరణ పరంగా ప్రభావాన్ని చూపించగలిగే వ్యాపారాలను గుర్తించడం, పెట్టుబడులు పెట్టడం కోసం గ్లోబల్‌ ఇంపాక్ట్‌ స్ట్రాటజీని ఏర్పాటు చేశామని ఝవేరీ చెప్పారు.  ప్రపంచంలోనే వ్యర్థాల నిర్వహణ అవసరం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటని... ఈ విషయంలో దేశవ్యాప్తంగా పరిష్కారాలను, సేవలను అందిస్తూ రామ్‌కీ కీలక పాత్ర పోషిస్తున్నదని రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ ఎండీ, సీఈఓ ఎం.గౌతమ్‌ రెడ్డి చెప్పారు. సమాజానికి ఎదురవుతున్న పర్యావరణ సవాళ్లను అధిగమించడంలో, ప్రభావశీలమైన పరిష్కారాలను అందించడంలో సానుకూల మార్పు తీసుకురావాలనే భావ సారూప్యత కారణంగా కేకేఆర్‌ సంస్థ తమకు మంచి భాగస్వామి కాగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పరిశ్రమలో దేశంలోనే ఇది అతిపెద్ద డీల్‌ అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.You may be interested

ఎస్సార్‌స్టీల్‌ ఇక ఆర్సెలర్‌ మిట్టల్‌ దే!

Tuesday 12th February 2019

ఎస్సార్‌ దివాలా కేసుపై నిర్ణయానికి ఎన్‌సీఎల్‌టీకి లైన్‌క్లియర్‌ అడ్డంకులను తొలగించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ దివాలా కేసు పురోగతిలో అడ్డంకులను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం తొలగించింది. దీంతో ఎస్సార్‌ స్టీల్‌ కోసం ఆర్సెలర్‌ మిట్టల్‌ తరఫున దాఖలైన అత్యధిక బిడ్‌పై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అహ్మదాబాద్‌ బెంచ్‌ ఒక నిర్ణయం తీసుకోగలుగుతుంది. వివరాల్లోకి వెళితే... ఎస్సార్‌ స్టీల్‌ కోసం ఆర్సెలర్‌ మిట్టల్‌ దాఖలు చేసిన రూ.42,000 కోట్ల

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Tuesday 12th February 2019

దేశీయమార్కెట్‌ మూడు రోజుల వరుస నష్టాల ప్రారంభానికి ముగింపు పలుకుతూ మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. నేడు రిటైల్‌, ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత కారణంగా నిఫ్టీ సూచీ 10900 స్థాయి వద్ద ఒడిదుడుకులకు లోనవుతోంది.  మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీ షేర్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. అలాగే ఎఫ్‌ఎంజీసీ షేర్లు కూడా స్వల్పంగా నష్టపోయాయి. ఉదయం గం.9:30నిల.కు నిఫ్టీ 11

Most from this category