News


కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ లాభం రూ.60 కోట్లు

Thursday 16th May 2019
news_main1557993721.png-25776

  • ఒక్కో షేర్‌కు 60 పైసలు డివిడెండ్‌

న్యూఢిల్లీ: కరూర్‌  వైశ్యా బ్యాంక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో 19 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.51 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.60 కోట్లకు పెరిగిందని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,700 కోట్ల నుంచి రూ.1,746 కోట్లకు పెరిగింది. రిటైల్‌ బ్యాంకింగ్‌ రంగ ఆదాయం 5 శాతం పెరిగి రూ.967 కోట్లకు చేరింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు 60 పైసలు డివిడెండ్‌ ఇవ్వనున్నామని వెల్లడించింది. 
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.346 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 39 శాతం తగ్గి రూ.211 కోట్లకు చేరింది. ఆదాయం మాత్రం రూ. 6,600 కోట్ల నుంచి రూ.6,779 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ రుణ నాణ్యత తగ్గింది. గత ఏడాది మార్చి నాటికి 6.56 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు 8.79 శాతానికి, నికర మొండి బకాయిలు 4.16 శాతం నుంచి 4.98 శాతానికి పెరిగాయి. విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.3,016 కోట్ల నుంచి రూ.4,450 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.1,863 కోట్ల నుంచి రూ.2,420 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలు పెరిగినా, కేటాయింపులు మాత్రం రూ.394 కోట్ల నుంచి రూ.352 కోట్లకు తగ్గాయని బ్యాంకు పేర్కొంది. ఈ  ఏడాది మార్చి నాటికి ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 56.86 శాతంగా ఉందని తెలిపింది. మార్చి క్వార్టర్‌లో రూ.487 కోట్ల మేర బాసెల్‌ త్రి టైర్‌ టూ బాండ్ల జారీ ద్వారా రూ.487 కోట్లు సమీకరించినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. రుణ నాణ్యత తగ్గడం, ఏడాది పరంగా చూస్తే, నికర లాభం క్షీణించడం వంటి కారణాల వల్ల కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ షేర్‌ భారీగా నష్టపోయింది. 



You may be interested

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలు రూ.2,477 కోట్లు

Thursday 16th May 2019

పెరిగిన ఎన్‌పీఏ కేటాయింపులు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలు గత ఆర్థిక సంవత్సరం (2018-19) జనవరి-మార్చి క్వార్టర్‌లో మరింతగా పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ,.2,114 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,477 కోట్లకు పెరిగాయి. కాగా గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో మాత్రం ఈ బ్యాంక్‌కు రూ.718 కోట్ల నికర నష్టాలు మాత్రమే వచ్చాయి.

భారత్‌కు చైనా పెట్టుబడులు ఖాయం

Thursday 16th May 2019

వాణిజ్య యుద్ధాల ప్రభావంపై ఆనంద్ మహీంద్రా ట్వీట్‌ న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో చైనా పెట్టుబడులు భారత్‌ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సమావేశమవుతారన్న వార్తల నేపథ్యంలో మహీం‍ద్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. "ఒకవేళ వివాదాస్పద అంశాలు పరిష్కారమైనప్పటికీ .. అమెరికాకు భారీగా ఎగుమతులు

Most from this category