STOCKS

News


కర్ణాటక బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ పెంపు

Wednesday 2nd January 2019
Markets_main1546410697.png-23363

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్‌ తాజాగా మార్జినల్ కాస్ట్‌ ఆఫ్ ఫండ్‌ ఆధారిత రుణాలపై వడ్డీ రేటును (ఎంసీఎల్‌ఆర్‌) 0.15 శాతం పెంచింది. దీంతో ఏడాది వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ 9.10 శాతానికి చేరినట్లవుతుందని, జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని బ్యాంక్ తెలిపింది. ఇక ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 0.10 శాతం పెరిగి 8.75 శాతానికి, మూడు నెలలది 0.10 శాతం మేర పెరిగి 8.70 శాతానికి చేరాయి. ఒక నెల రోజులు, ఒక్క రోజు వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ను కూడా 0.10 శాతం మేర పెంచినట్లు కర్ణాటక బ్యాంక్ తెలిపింది. ఇకపై 6 నెలల ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమైన రూ. 75 లక్షల దాకా రుణాలపై 8.80 శాతం వడ్డీ రేటు ఉంటుందని వివరించింది. అటు మరో ప్రైవేట్ రంగ ధన్‌లక్ష్మి బ్యాంక్ కూడా జనవరి 1 నుంచి 1 ఏడాది వ్యవధి ఎ౾ంసీఎల్‌ఆర్‌ను పెంచడంతో ఇది 9.90 శాతానికి చేరింది.
బ్యాంకింగ్‌ యాప్‌ ఆవిష్కరణ
కాగా కర్ణాటక బ్యాంక్‌ గురువారం బ్యాంకింగ్‌ యాప్‌ను ఆవిష్కరించింది. తన వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఈ యాప్‌ను ఆవిష్కరించినట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం బ్యాంక్‌ సేవలకు సంబంధించి ఉన్న పలు యాప్‌ల (బీహెచ్‌ఐఎం కేబీఎల్‌ యూపీఐ, కేబీఎల్‌ ఎంపాస్‌బుక్‌, కేబీఎల్‌ లొకేటర్‌, ఎంకామర్స్‌ ఆన్‌లైన్‌) సేవలు సహా పలు బ్యాంక్‌ సేవలు సమగ్రంగా తాజా యాప్‌ ద్వారా అందుబాటులోకి వస్తాయని బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈఓ మహాబలేశ్వర్‌ ఎంఎస్‌ పేర్కొన్నారు.You may be interested

దోమ కుట్టకుండా.. రూ.6వేల కోట్లు!!

Wednesday 2nd January 2019

- మార్కెట్లోకి కొత్త నివారణ ఉత్పత్తులు - ఐదు కంపెనీల పోటాపోటీ - 80 శాతం వాటా ఈ సంస్థలదే హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇళ్లలో దోమల నివారణకు ఏటా దేశవ్యాప్తంగా జనం పెడుతున్న ఖర్చెంతో తెలుసా? అక్షరాలా ఆరువేల కోట్ల రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జనాన్ని దోమలు ఎంతలా భయపెడుతున్నాయో చెప్పటానికి ఈ అంకెలు చూస్తే చాలు. అయితే ఇదంతా ఇళ్లలో దోమల నివారణ ఉత్పత్తుల కోసం జనం

2019లోనూ కేంద్రానికి భారీగా నిధులు

Wednesday 2nd January 2019

ఎయిర్‌ ఇండియా వాటాల అమ్మకమే తరువాయి 2018లో ప్రభుత్వ కంపెనీల్లో వాటాల అమ్మకంతో రూ.77,417 కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల విక్రయం ద్వారా రూ.77,417 కోట్లను సమీకరించింది. ఇక 2019లోనూ ఎయిర్‌ ఇండియాలో వాటాలను ఎలాగైనా విక్రయించాలన్న లక్ష్యంతో ఉంది. దీంతో ఈ ఏడాది కూడా కేంద్రానికి గణనీయంగానే నిధులు సమకూరనున్నాయి. గతానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ కంపెనీల మధ్య విలీనాల ద్వారా

Most from this category