కోనాలో నౌకాశ్రయ అభివృద్ధి
By Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాకినాడ సెజ్ లిమిటెడ్ (కేఎస్ఈజెడ్) అనుబంధ సంస్థ అయిన కాకినాడ గేట్‌వే పోర్ట్ (కేజీపీఎల్) తూర్పు గోదావరి జిల్లాలోని కోనా గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ వాణిజ్య నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయనుంది. కేఎస్ఈజెడ్కు చెందిన 1,811 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. సుమారు రూ.2,123 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ పోర్ట్‌లో సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా సుమారు 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని కేజీపీఎల్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పంద చేసుకున్నట్లు తెలిపింది. పోర్ట్ అభివృద్ధితో పాటు డిజైన్, నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు కూడా కేజీపీఎల్ చేపడుతుంది. తొలి 30 ఏళ్ల పాటు సీఓడీ ఆదాయంలో 2.7 శాతం, 31–40 ఏళ్ల వరకు 5.4 శాతం, 41–50 ఏళ్ల వరకు ఆదాయంలో 10.8 శాతం వాటా ఉంటుంది.
You may be interested
రైల్వేకు సర్వీస్ ప్రొవైడర్‌గా జియో
Thursday 22nd November 2018న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేకు టెలికం సేవల ప్రొవైడర్ అవకాశాన్ని రిలయన్స్ జియో సొంతం చేసుకుంది. వచ్చే జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీనివల్ల రైల్వే టెలిఫోన్ బిల్లుల భారం కనీసం 35 శాతం మేర తగ్గి పోతాయని అధికారులు తెలిపారు. భారతీయ రైల్వేకు గత ఆరేళ్లుగా భారతీ ఎయిర్టెల్ టెలికం సేవలు అందిస్తోంది. 1.95 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్లను సీయూజీ కింద
టాప్-100లో ముగ్గురు హైదరాబాదీ రియల్టర్లు
Thursday 22nd November 2018హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలతో పాటు ఈ రంగంలో సంపదను సృష్టిస్తున్న శ్రీమంతులూ పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా టాప్-15 మంది రియల్టీ కుబేరుల్లో తెలంగాణ నుంచి ‘మై హోమ్ కన్స్ట్రక్షన్స్’ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు తొలిసారిగా స్థానం దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా రియల్టీ దిగ్గజాల్లో ఈయన 14వ స్థానంలో నిలిచారు. ఈ మేరకు ‘గ్రోహె- హురున్ ఇండియా రియల్ ఎస్టేట్’ 2018వ సంవత్సరానికి సంబంధించిన జాబితా విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి