STOCKS

News


జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ బంపర్‌ ఫలితాలు

Thursday 25th October 2018
news_main1540445689.png-21467

న్యూఢిల్లీ: డామినోస్‌ పిజ్జా, డంకిన్‌ డోనట్స్‌ బ్రాండ్లపై ఫుడ్‌ స్టోర్లను నిర్వహించే జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. లాభం 60 శాతం పెరిగి రూ.77.67 కోట్లకు చేరుకుంది. డామినోస్‌ పిజ్జా స్టోర్ల నుంచి అధిక అమ్మకాలు లాభాల వృద్ధికి తోడ్పడ్డాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.48 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం ఆదాయం సైతం సెప్టెంబర్‌ త్రైమాసికంలో 22 శాతం పెరిగి రూ.892 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.657 కోట్ల నుంచి రూ.772 కోట్లకు పెరిగినట్టు జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ తెలిపింది. ‘‘సెప్టెంబర్‌ త్రైమాసికంలో స్టోర్ల ప్రారంభాన్ని పెంచాం. 24 కొత్త డామినోస్‌ స్టోర్లను తెరిచాం. గత ఏడు త్రైమాసికాల కాలంలో ఈ స్థాయిలో స్టోర్లను ప్రారంభించింది సెప్టెంబర్‌ క్వార్టర్లోనే’’ అని జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ తెలిపింది. ఇక జూలై- సెప్టెంబర్‌ కాలంలో ఐదు డంకిన్‌ డోనట్స్‌ స్టోర్లను మూసేసింది. గతేడాదితో పోలిస్తే నష్టాలు సగానికంటే తగ్గినట్టు కంపెనీ తెలిపింది. ‘‘డెలివరీ ఆర్డర్లలో బలమైన వృద్ధి నెలకొంది. డిజిటల్‌పై దృష్టి పెట్టడంతో ఆన్‌లైన్‌ అమ్మకాలు పెరిగాయి. నూతన డామినోస్‌ యాప్‌కు యూజర్ల నుంచి మంచి రేటింగ్‌ ఉంది’’ అని కంపెనీ సీఈవో ప్రతీక్‌ పోట తెలిపారు. జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌కు దేశవ్యాప్తంగా 269 పట్టణాల్లో 1,167 డామినోస్‌ పిజ్జా స్టోర్లు ఉన్నాయి. అలాగే, 10 పట్టణాల్లో 32 డంకిన్‌ డోనట్స్‌ స్టోర్లు సైతం ఉన్నాయి. 



You may be interested

జోరందుకున్న ఎయిర్‌ జర్నీ

Thursday 25th October 2018

ముంబై: దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య గతనెలలో గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 114 లక్షల మంది దేశీ విమానాల్లో ప్రయాణం చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా విడుదలచేసిన డేటా ద్వారా వెల్లడైంది. ఏడాది ప్రాతిపదికన 18.95 శాతం రేటు వృద్ధి నమోదైంది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్‌లో 95.83 లక్షల మంది ప్రయాణికులు దేశీ విమానాల్లో ప్రయాణం చేశారు. గతనెలలో ఎయిర్‌

నవంబర్‌ 5న గోల్డ్‌ ఈటీఎఫ్‌ ట్రేడింగ్‌ వేళల పెంపు

Thursday 25th October 2018

న్యూఢిల్లీ: ధన్‌తేరాస్‌ సందర్భంగా నవంబర్‌ 5న గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, సార్వభౌమ బంగారం బాండ్లలో ట్రేడింగ్‌ వేళలను సాయంత్రం 7 గంటల వరకు పెంచుతున్నట్టు దేశీ స్టాక్‌ ఎక్సే‍్ఛంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రకటించాయి. 3.30 గంటలకు మార్కెట్లు యథావిధిగా క్లోజవుతాయని... తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి 7 గంటల వరకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, సార్వభౌమ బంగారం బాండ్లలో ట్రేడింగ్‌ ఉంటుందని తెలిపాయి. దీపావళికి ముందు వచ్చే త్రయోదశి రోజును ధన్‌తేరాస్‌గా

Most from this category