STOCKS

News


ఆర్‌ఐఎల్‌ ఎర్నింగ్స్‌ వృద్ధిలో క్షీణత!

Tuesday 18th June 2019
news_main1560852381.png-26388

జేపీ మోర్గాన్‌ అంచనా
రిఫైనింగ్‌, పెట్రోకెమ్‌ మార్జిన్ల బలహీనతతో ఈ ఆర్థిక సంవత్సరం ఆర్‌ఐఎల్‌ ఎర్నింగ్స్‌ గ్రోత్‌ 15 శాతం తగ్గవచ్చని దిగ్గజ బ్రోకరేజ్‌ జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. మౌలిక వ్యాపారంలో బలహీనతను తట్టుకునేందుకు జియో టారిఫ్‌లను 12- 20 శాతం మేర ఆర్‌ఐఎల్‌ పెంచవచ్చని అభిప్రాయపడింది. ఈ విధమైన పెరుగుదల టెలికం రంగంలో మరింత పోటీని, అసమానతను పెంచవచ్చని తెలిపింది. ఆర్‌ఐఎల్‌ ఎర్నింగ్స్‌ గ్రోత్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు ఆందోళన వ్యక్తం చేయడం గత నెల ఆరంభమైంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆర్‌ఐఎల్‌ ఎర్నింగ్స్‌ వృద్ధి సగానికి తగ్గవచ్చని గతనెల్లో మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడింది. తాజాగా జేపీ మోర్గాన్‌సైతం ఇదే అంచనా వెలిబుచ్చింది. ఒకవేళ రిఫైనింగ్‌ మార్జిన్స్‌ పెరగడం అనుకున్నదానికన్నా తక్కువగా ఉంటే ఎర్నింగ్స్‌లో 9 శాతం క్షీణత ఉండొచ్చని, ఇదే జరిగితే టెలికం టారిఫ్‌ల్లో పెరుగుదల ఉండకపోవచ్చని తెలిపింది. రిఫైనింగ్‌, పెట్రోకెమ్‌ వ్యాపారాల్లో బలహీనత షేరు ధరపై సమీప భవిష్యత్‌లో ప్రభావం చూపకపోవచ్చని సంస్థ పేర్కొంది. ప్రస్తుతానికి ఆర్‌ఐఎల్‌పై న్యూట్రల్‌ రేటింగ్‌ను రూ. 1300 టార్గెట్‌ ధరను కొనసాగిస్తున్నామని వెల్లడించింది.

గత నెల క్రెడిట్‌ సూసీ సం‍స్థ ఆర్‌ఐఎల్‌ టార్గెట్‌ను రూ. 1425 నుంచి రూ. 1350కి తగ్గించింది. జెఫర్రీస్‌ సంస్థ రూ. 990 టార్గెట్‌ ధరగా నిర్ణయించి, అండర్‌పెర్ఫామ్‌ రేటింగ్‌ ఇచ్చింది. ఆర్‌ఐఎల్‌ గత రెండేళ్లుగా మంచి పెట్రోకెమ్‌ ఎర్నింగ్స్‌ను నమోదు చేస్తోంది. భవిష్యత్‌లో జియో టారిఫ్‌ల పెంపు, రిఫైనింగ్‌ వ్యాపారంలో పురోగతి, టెలికం ఆర్పుల్లో మెరుగుదల, కన్జూమర్‌టెక్‌ వ్యాపారంలో వాటా విక్రయం లాంటి అంశాలు షేరు ధరపై పాజిటివ్‌ ప్రభావం చూపుతాయని జేపీ మోర్గాన్‌ తెలిపింది. 



You may be interested

99 స్టాకుల్లో ఎంఏసీడీ బేరిష్‌

Tuesday 18th June 2019

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   ఇవి బేరిష్‌ దేశీయ

వేదాంత హోల్డ్‌ చేయవచ్చు: ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌

Tuesday 18th June 2019

వేదాంత లిమిటెడ్‌ కంపెనీ షేర్లని రూ.175ల టార్గెట్‌ ధర వద్ద హోల్డ్‌ చేయవచ్చని ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ సూచించింది. షేరు టార్గెట్‌ను చేరుకునేందుకు ఏడాది కాలపరిమితిని నిర్దేశించింది. ఖర్చును తగ్గించుకునేందుకు వ్యయ నియంత్రణ కార్యక్రమాలు, నాన్‌ ఇంటిగ్రేటెడ్ వ్యాపార నమూనా నుండి అల్యూమినియం వ్యాపారం ప్రయోజనం పొందుతుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. వేదాంత ఏప్రిల్‌లో అల్యూమినియం ఉత్పత్తి రికార్డుస్థాయిలో 152 కిలో టన్నులు నమోదు చేసింది. వ్యయనియంత్రణ, అధికంగా ఉత్పత్తి

Most from this category