News


జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ రేసులో ఐదు కంపెనీలు

Wednesday 21st November 2018
news_main1542776256.png-22252

న్యూఢిల్లీ: భారీ రుణ భారంతో దివాల ప్రక్రియను ఎదుర్కొంటున్న జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను టేకోవర్‌ చేయడానికి ఐదు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఎన్‌బీసీసీ, కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ఎల్‌ అండ్‌ టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సింగపూర్‌కు చెందిన క్యూబ్‌ హైవేస్‌, సురక్ష గ్రూప్‌లు ఈ టేకోవర్‌ రేస్‌లో ఉన్నాయి. 

తాజా బిడ్‌లు..
జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను టేకోవర్‌ చేయడానికి రూ.7,000 కోట్లతో సురక్ష గ్రూప్‌ గతంలోనే బిడ్‌ను సమర్పించింది. ఈ బిడ్‌ను జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ రుణదాతలు తిరస్కరించారు. దీంతో జేపీ ​ఇన్‌ఫ్రాటెక్‌కు ఇంటెరిమ్‌ రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తున్న అనుజ్‌ జైన్‌ గత నెలలో తాజాగా బిడ్‌లను ఆహ్వానించారు. ఇప్పుడు ఐదు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయని జైన్‌ వెల్లడించారు. కాగా జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ బ్యాంక్‌ బకాయిలు దాదాపు రూ.9,800 కోట్ల మేర ఉంటాయి. వీటిల్లో 4,334 కోట్ల రుణాలు ఐడీబీఐ బ్యాంక్‌​ ఇచ్చినవే. మిగిలిన రుణాలను ఐఐఎఫ్‌సీఎల్, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, కార్పొరేషన్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఐసీఐసీఐ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఐఎఫ్‌సీఐ, జే అండ్‌ కే బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, శ్రేయీ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌లు ఇచ్చాయి. 

జేపీ గ్రూప్‌ ప్రధాన కంపెనీ జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ అనుబంధ సంస్థ అయిన జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ 32,000 ఫ్లాట్లను అభివృద్ధి చేస్తోంది. వీటిల్లో 9,500 ప్లాట్లను డెలివరీ చేసింది.You may be interested

గల్ఫ్‌ ఆయిల్‌ నుంచి రెండు కొత్త బ్యాటరీలు

Wednesday 21st November 2018

అహ్మదాబాద్‌: లూబ్రికెంట్ల తయారీ సంస్థ గల్ఫ్‌ ఆయిల్‌... రెండు కొత్త టూ-వీలర్‌ బ్యాటరీలను మార్కెట్లోకి తెచ్చింది. బ్యాటరీల వ్యాపారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడైన క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా సమక్షంలో ఈ గల్ఫ్‌ ప్రైడ్‌ బ్యాటరీలను కంపెనీ ఆవిష్కరించింది. టూ-వీలర్‌ బ్యాటరీ మార్కెట్లో తమ వాటాను క్రమంగా పెంచుకుంటున్నామని గల్ఫ్‌ ఆయిల్‌ ఎండీ రవి చావ్లా పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,000 కోట్ల రీప్లేస్‌మెంట్‌ మార్కెట్లో తమ వాటా 1.5

62 డాలర్లకు పతనమైన బ్రెంట్‌ క్రూడ్‌

Wednesday 21st November 2018

4.43 డాలర్ల క్షీణత డిసెంబర్‌ 2017 స్థాయికి పతనం ముడిచమురు ధరలు ఏడాది కనిష్టస్థాయికి పతనమయ్యాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్‌) తీసుకుంటున్న నిర్ణయాలు ఫలించవనే అంచనాల నేపథ్యంలో యూఎస్‌ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) క్రూడ్ బ్యారెల్ ధర 3.77 శాతం పతనమై 53.43 డాలర్లకు తగ్గింది. జనవరి 19తో ముగిసే ఫ్యూచర్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 52.77 కనిష్టానికి పతనమైంది. ఇది అక్టోబర్‌ 2017 నాటి ధర కాగా, గతేడాదిలో నమోదైన

Most from this category