STOCKS

News


రూ.875 కోట్లు సమీకరించనున్న  జేఎమ్‌ ఫైనాన్షియల్‌ క్రెడిట్‌ సొల్యూషన్స్‌

Friday 28th September 2018
news_main1538109032.png-20657

ముంబై: జేఎమ్‌ ఫైనాన్షియల్‌ క్రెడిట్‌ సొల్యూషన్స్‌ సంస్థ, రూ.875 కోట్ల నిధులు సమీకరించనున్నది. జేఎమ్‌ ఫైనాన్షియల్‌ గ్రూప్‌, విక్రమ్‌ పండిట్‌, సింగపూర్‌ జీఐసీ ఫండ్‌, కాలిఫోర్నియా యూనివర్శిటీ ఎండోమెంట్‌ ఫండ్‌లకు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని జేఎమ్‌ ఫైనాన్షియల్‌ క్రెడిట్‌ సొల్యూషన్స్‌ వెల్లడించింది. ఈక్విటీ ద్వారా నిధుల సమీకరణ ప్రాతిపదికన  ఈ ఎన్‌బీఎఫ్‌సీ విలువ రూ.7,175 కోట్లుగా ఉంటుందని అంచనా. కాగా ఈ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఎన్‌బీఎఫ్‌సీ రూ.505 కోట్ల మేర నిధులను సమీకరించింది. 



You may be interested

మేక్‌ మై ట్రిప్‌ ‘షార్ట్‌ స్టేస్‌’

Friday 28th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీ మేక్‌ మై ట్రిప్‌ ‘షార్ట్‌ స్టేస్‌’ పేరుతో దేశంలో తొలిసారిగా వినూత్న విధానాన్ని అక్టోబరులో పరిచయం చేయబోతోంది. సాధారణంగా ఏ హోటల్‌కు వెళ్లినా గది చార్జీ 24 గంటలుగా లెక్కకడతారు. షార్ట్‌ స్టేస్‌ విధానంలో 4 గంటల వ్యవధికి కూడా గది అద్దెకు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విధానాన్ని తిరుపతిలో పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నట్టు మేక్‌ మై ట్రిప్‌ ఇండియా

బలపడిన రూపాయి..

Friday 28th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి శుక్రవారం మార్నింగ్‌ ట్రేడింగ్‌లో బలపడింది. పది పైసలు లాభంతో 72.49 వద్ద ప్రారంభమైంది. రూపాయి మునపటి ముగింపు 72.59గా ఉంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం ఫ్లాట్‌గానే ముగిసింది. రూపాయి బుధవారం క్లోజింగ్‌ 72.61గా ఉంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. రూపాయి గత కొన్ని సెషన్లుగా 72.60-73 స్వల్ప రేంజ్‌లో కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది.  కాగా అమెరికా డాలర్‌-రూపాయి

Most from this category