STOCKS

News


ఓపెన్‌ మార్కెట్లో స్పెక్ట్రం కొనేందుకు జియో సిద్ధం!

Saturday 20th April 2019
news_main1555756328.png-25245

టెలికం సేవలు అంతరాయాలు లేకుండా అందించేందుకు ఓపెన్‌ మార్కెట్లో స్పెక్ట్రం కొనుగోలు చేయాలని రిలయన్స్‌ జియో భావిస్తోంది. ప్రస్తుతం జియోకు 30 కోట్ల సభ్యులున్నారు. నెలకు కొత్తగా కోటిమందిని చేర్చుకుంటోంది. గత త్రైమాసికంలో కంపెనీ ఆర్‌కామ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని టెలికం శాఖ అభ్యంతరాల కారణంగా రద్దు చేసుకుంది. ఆర్‌కామ్‌ నుంచి స్పెక్ట్రం కొనుగోలు చేయాలని జియో భావించినా, ఆర్‌కామ్‌ బకాయిల విషయంలో డీఓటీ పెట్టిన షరతులను ఒప్పుకోలేక ఒప్పందం రద్దు చేసుకుంది. ప్రస్తుతం ఆర్‌కామ్‌కు చెందిన 850 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రంను 21 సర్కిళ్లలో జియో వాడుకుంటోంది. ఇప్పటికైతే జియో వద్ద సరిపడ అన్ని బ్యాండ్స్‌కు చెందిన స్పెక్ట్రం ఉన్నా, భవిష్యత్‌లో పెరిగే కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ కొత్త స్పెక్ట్రం కొనుగోలు చేయనుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్‌కామ్‌ స్పెక్ట్రం వాడకం ఎప్పటికైనా లీగల్‌ సమస్యలు తెస్తుందని, ఆ కంపెనీకున్న ఆర్థిక సమస్యలతో ఎప్పుడైనా ఇబ్బందులు తప్పవని నిపుణుల అంచనా. ఇదే జరిగితే జియో సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆర్‌కామ్‌ ఒప్పందం రద్దయినా తమకు కావల్సినంత స్పెక్ట్రంఉందని, అయితే అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు మరింత స్పెక్ట్రం కొనుగోలు చేస్తామని జియో ప్రతినిధి క్యు4 ఫలితాల వేళ చెప్పారు. మరోవైపు కంపెనీ ఆప్టిక్‌ ఫైబర్‌, టవర్‌ ఇన్‌ఫ్రా వ్యాపారాల డీమెర్జర్‌ జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. You may be interested

పెట్టుబడులను రక్షించే వ్యూహమేంటి?

Saturday 20th April 2019

ఎన్నికల సందర్భంగా ఒకపక్క ఎఫ్‌ఐఐల నిధుల కుమ్మరింపు, మరోపక్క డీఐఐల అమ్మకాలతో మార్కెట్లో రిటైలర్‌కు ఎటూపాలుపోని స్థితి కనిపిస్తోంది. ఎఫ్‌ఐఐలు సాధారణంగా స్థిరప్రభుత్వం ఉన్న దేశాల మార్కెట్లలో పెట్టుబడులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. గతేడాది చివర్లో ప్రధాని మోదీకి జనాకర్షణ తగ్గినట్లు కనిపించింది, కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి చూసింది. దీంతో మార్కెట్లో భయాలు ఎక్కువయ్యాయి. గతంలోలాగా కిచిడీ ప్రభుత్వాలు వస్తాయన్న భయాలు మహాఘట్భంధన్‌తో మరింత పెరిగాయి. ఒకవేళ యూపీఏ

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా చాహెల్‌ నియమాకం

Saturday 20th April 2019

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ సైరీ చాహల్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం చాహల్‌  ‘‘షీరోస్ డాట్ ఇన్‌’’ కంపెనీ ఫౌండర్‌, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సంస్థ మధ్య వయస్సు మహిళలకు ఇంటి దగ్గరే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. వినియోగదారుల సేవారంగంలో అపారమైన అనుభవం కలిగిన చాహల్‌ బోర్డు సభ్యురాలుగా నియామితులు కావడం తనకెంతో గర్వంగా

Most from this category