STOCKS

News


జెట్ ‍బిడ్డింగ్ విజయవంతమవుతుంది

Friday 19th April 2019
news_main1555651449.png-25217

- రుణదాతల ఆశాభావం
- షేరు 32 శాతం పతనం

న్యూఢిల్లీ:  ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాల విక్రయానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ విజయవంతమవుతుందని రుణాలిచ్చిన సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. "సంస్థ విలువను సముచితంగా, పారదర్శకంగా మదింపు చేసేలా బిడ్ ప్రక్రియ విజయవంతం అవుతుందని రుణదాతలు ఆశావహంగా ఉన్నారు" అని బ్యాంకర్ల కన్సార్షియం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు రూ. 8,000 కోట్ల పైగా రుణభారంతో కుంగుతున్న జెట్‌కు ఊపిరినిచ్చేలా అత్యవసరంగా రూ. 400 కోట్లు సమకూర్చడానికి బ్యాంకులు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం రాత్రి నుంచి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. జెట్‌ యాజమాన్యాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న 26 బ్యాంకుల కన్సార్షియం..  75 శాతం దాకా వాటాలను విక్రయించేందుకు బిడ్లను పిలిచింది. ఎతిహాద్ ఎయిర్‌వేస్‌, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ, ఎన్‌ఐఐఎఫ్‌, ఇండిగో పార్ట్‌నర్స్ సంస్థలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఇవి మే 10 లోగా తుది బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. 
భారీగా పతనమైన జెట్‌ షేరు...
కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో గురువారం జెట్ ఎయిర్‌వేస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఏకంగా 32 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈలో 32.23 శాతం క్షీణతతో రూ. 163.90 వద్ద జెట్ షేరు క్లోజయ్యింది. ఒక దశలో 34.62 శాతం దాకా తగ్గి రూ. 158.10 (52 వారాల కనిష్టం) స్థాయికి కూడా పడిపోయింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో జెట్ షేర్లు 31 శాతం క్షీణించి రూ. 165.75 వద్ద క్లోజయ్యాయి. బీఎస్‌ఈలో 60.41 లక్షలు, ఎన్‌ఎస్‌ీలో 5 కోట్ల షేర్లు చేతులు మారాయి. రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,111 కోట్ల మేర క్షీణించి రూ. 1,862 కోట్లకు పడిపోయింది. 



You may be interested

39 శాతం పెరిగిన ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం

Friday 19th April 2019

- రూ.247 కోట్లకు నికర లాభం  - ఒక్కో షేర్‌కు రూ.2.70 మధ్యంతర డివిడెండ్‌  - రూ.3,500 కోట్లు సమీకరణ న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 39 శాతం పెరిగింది. అంతకుముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.178 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ4లో రూ.247 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం

ఫిబ్రవరిలో జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌దే హవా

Friday 19th April 2019

న్యూఢిల్లీ: దేశీ టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఫిబ్రవరి చివరినాటికి 120.50 కోట్లకు చేరింది. జనవరిలో ఈ సంఖ్య 120.37 కోట్లుగా ఉన్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) వెల్లడించింది. రిలయన్స్‌ జియో, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ జోరు కారణంగానే వినియోగదారుల సంఖ్య ఈమేరకు పెరిగినట్లు ట్రాయ్‌ పేర్కొంది. ఈ రెండు దిగ్గజ సంస్థలు కలిపి ఫిబ్రవరిలో 86.39 లక్షల కస్టమర్లను జోడించగా.. మిగిలిన టెలికం కంపెనీలు 69.93

Most from this category