జెట్ ఎయిర్వేస్ టికెట్లపై 30% డిస్కౌంట్
By Sakshi

ముంబై: నిధుల సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తాజాగా విమాన టికెట్ల చార్జీలపై 30 శాతం మేర డిస్కౌంటు ప్రకటించింది. దేశీ, విదేశీ రూట్లలో 25 లక్షల సీట్లను ఈ ఆఫర్లో భాగంగా విక్రయిస్తోంది. మంగళవారం ప్రారంభమైన బుకింగ్స్ ఆరు రోజుల పాటు సాగుతాయని సంస్థ తెలిపింది. అన్ని మాధ్యమాల ద్వారా సెప్టెంబర్ 7 దాకా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ఆ తర్వాత కంపెనీ వెబ్సైట్, మొబైల్స్ ద్వారా సెప్టెంబర్ 9 దాకా కొనుగోలు చేయొచ్చని వివరించింది. సెప్టెంబర్ 10 నుంచి చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. దేశీ రూట్లతో పాటు యూరప్, గల్ఫ్, దక్షిణాసియా దేశాల్లోని ప్రాంతాలకు టికెట్లు బుక్ చేసుకోవచ్చని జెట్ ఎయిర్వేస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజ్ శివకుమార్ తెలిపారు. చౌక చార్జీల విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ఏషియా మొదలైనవి ఇప్పటికే డిస్కౌంట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ ఈ ఆర్థిక సంవత్సం జూన్ త్రైమాసికంలో జెట్ ఎయిర్వేస్ ఏకంగా రూ. 1,300 కోట్ల నష్టాలు ప్రకటించింది. ప్రస్తుతం సమస్యను గట్టెక్కేందుకు నిధుల వేటలో ఉంది. ముందస్తుగా టికెట్ల విక్రయం ద్వారా కొంతైనా నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది.
You may be interested
ఎన్‌బీఎఫ్‌సీలకు ఇక మొండి బండ
Wednesday 5th September 2018ఇప్పటిదాకా బ్యాంకులను వణికించిన మొండి బకాయిల సమస్య ఇప్పుడు బ్యాంకేతర ఆర్థిక సంస్థలపై (ఎన్బీఎఫ్సీ-నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ) కూడా గట్టిగానే ప్రభావం చూపించనుంది. కొత్త అకౌంటింగ్ నిబంధనలు దీనికి కారణం కానున్నాయి. పాత అకౌంటింగ్ పద్ధతిలో బకాయిలు మొండి బకాయిలుగా మారేంత వరకూ వేచి చూసి అప్పుడు కేటాయింపులు జరిపాల్సి ఉండేది. కానీ కొత్తగా అమల్లోకి రానున్న ద ఇండియాన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ (ఇండ్ యాజ్) ప్రకారం భవిష్యత్తులో
‘అమ్రపాలి’ ప్రాజెక్టులను 36 నెలల్లో పూర్తి చేస్తాం
Wednesday 5th September 2018న్యూఢిల్లీ: రియల్టీ కుంభకోణంలో చిక్కుకున్న అమ్రపాలి గ్రూప్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సిద్ధమేనని సుప్రీం కోర్టుకు ప్రభుత్వ రంగ ఎన్బీసీసీ వెల్లడించింది. దాదాపు 15 హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 46,575 ఫ్లాట్స్‌ను 36 నెలల్లో దశల వారీగా నిర్మించి ఇవ్వగలమని... ఇందుకు దాదాపు రూ.8,500 కోట్ల నిధులు కావాలని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ప్రతిపాదించింది. కేసును విచారిస్తున్న జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ యూయూ లలిత్‌ల ధర్మాసనం.. ఎన్బీసీసీ