STOCKS

News


జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.3,000 కోట్లు

Monday 18th February 2019
news_main1550472012.png-24239

సగానికి తగ్గనున్న నరేశ్‌ గోయల్‌ వాటా ! 
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.3,000 కోట్ట పెట్టుబడులు అందనున్నాయి. రుణ పునర్వ్యస్థీకరణ అనంతరం ఎతిహాద్‌, నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌) ఈ పెట్టుబడులు అందించనున్నాయని సమాచారం. దీంతో ప్రమోటర్‌ నరేశ్‌ గోయల్‌ వాటా ప్రస్తుతమున్న 51 శాతం నుంచి 20 శాతానికి  తగ్గనున్నది. 

ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌లో అబుదాబికి చెందిన ఎతిహాద్‌కు 24 శాతం వాటా ఉంది.ఈ కంపెనీ రూ.1,400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నదని అంచనా. అలాగే అబూదాబి ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఐఐఎఫ్‌ 19 శాతం వాటా కొనుగోలు కోసం రూ.1,400 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తుందని సమాచారం. ఈ నెల 14న జరిగిన బోర్డ్‌ సమావేశంలో ఒక తాత్కాలిక రిజల్యూషన్‌ ప్లాన్‌ను ఆమోదించారు. ఈ ప్రణాళికకు ఈ నెల 21న జరిగే వాటాదారుల సమావేశంలో వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంది. ఈ ప్రణాళికలో భాగంగా రుణభారాన్ని ఈక్విటీగా మార్చుతారు. దీని కోసం 11.4 కోట్ల ఈక్విటీ షేర్లను జారీచేస్తారు. తదనంతరం బ్యాంక్‌లు మరిన్ని రుణాలను మంజూరు చేస్తాయి.



You may be interested

వొడాఫోన్‌ ఐడియాకు రూ.20,000 కోట్లు !

Monday 18th February 2019

-టవర్ల వాటా, ఆప్టిక్‌ ఫైబర్‌ విక్రయం ద్వారా  న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియా కంపెనీ మొబైల్‌ టవర్‌ సంస్థ, ఇండస్‌ టవర్‌లో వాటా విక్రయించాలని యోచిస్తోంది. ఈ వాటా విక్రయంతో పాటు ఆప్టికల్‌ ఫైబర్‌ ఆస్తులను కూడా విక్రయించనున్నది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం.  విక్రయాల్లో భాగంగా ఇండస్‌ టవర్స్‌లో 11.15 శాతం వాటాను, అలాగే 1.56 లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విక్రయించనున్నారు. ఈ విక్రయాల కారణంగా రూ.20,000 కోట్లు

డిజిన్వెస్ట్‌మెం‍ట్‌ నిధులు రూ.53,558 కోట్లు

Monday 18th February 2019

-ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.80,000 కోట్లు  -లక్ష్య సాధన సంశయయే ! -వచ్చే ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.90,000 కోట్లు  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.53,558 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.80,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మరో నెలలో ముగియ నుండటం, స్టాక్‌ మార్కెట్‌

Most from this category