STOCKS

News


జెట్‌ ఎయిర్‌వేస్‌ డిఫాల్ట్‌!

Wednesday 2nd January 2019
news_main1546409791.png-23359

నిధుల కొరత, రుణభారంతో కుదేలవుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ తాజాగా బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించలేక చేతులెత్తింది. డిసెంబర్‌ చివరకు బ్యాంకుల కన్సార్టియంకు చెల్లించాల్సిన అసలు, వడ్డీని చెల్లించలేకపోయామని కంపెనీ తాజాగా స్టాక్‌ ఎక్చేంజ్‌లకు తెలియజేసంది. నిధుల ప్రవాహంలో ఏర్పడ్డ తాత్కాలిక ఇబ్బందులతో డిఫాల్ట్‌ అయినట్లు వివరించింది. నిధుల కొరత కారణంగా కొందరు రుణదాతలకు చెల్లింపులను సకాలానికి చేయలేకపోవచ్చని ఇటీవలే కంపెనీ ప్రకటించింది. లోన్‌ రీపేమెంట్‌ చేయలేక డిఫాల్ట్‌ కావడం కంపెనీ చరిత్రలో ఇదే ప్రధమం. దేశీయ బ్యాంకులకు కంపెనీ దాదాపు రూ.3400 కోట్లు బకాయి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల చెల్లింపులకు సంబంధించి కంపెనీకి రూ. 1500 కోట్లు అవసరపడతాయి. చెల్లింపులపై ఆందోళనతో ఇప్పటికే కన్సార్టియం లీడరైన ఎస్‌బీఐ కంపెనీ పద్దులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించింది. అప్పుల ఇక్కట్లు తప్పించుకునేందుకు కంపెనీ అనేక మార్గాలను అన్వేషిస్తున్నా ఫలితం కానరాలేదు. లిక్విడిటీకి అవసర చర్యలు తీసుకోవడంలో జాప్యంతో ఇప్పటికే కంపెనీ దీర్ఘకాలిక రేటింగ్‌లు డౌన్‌గ్రేడ్‌ అయ్యాయి. గత మూడు త్రైమాసికాల్లో కలిసి కంపెనీ రూ. 3,656 కోట్ల నష్టాలను ప్రకటించింది. ఈ మొత్తం కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ కన్నా అధికం. 



You may be interested

ఎల్‌ఐసీ చైర్మన్‌గా భార్గవకు అదనపు బాధ్యతలు

Wednesday 2nd January 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి చైర్మన్‌గా ప్రస్తుత ఎండీ హేమంత్‌ భార్గవ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఎల్‌ఐసీ చైర్మన్‌గా వీకే శర్మ డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేయడంతో తాత్కాలికంగా భార్గవకు ఈ బాధ్యతలు అప్పగించారు. హేమంత్‌ భార్గవ 2017 ఫిబ్రవరి నుంచి ఎల్‌ఐసీ ఎండీ బాధ్యతల్లో ఉన్నారు. చైర్మన్‌ పదవికి ఇంటర్వ్యూలు ఎల్‌ఐసీ చైర్మన్‌, ఎండీ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ శాఖ

ప్రజా రవాణాకు జీపీఎస్‌ తప్పనిసరి!

Wednesday 2nd January 2019

- కొత్త వాహన నిబంధనలు అమల్లోకి - పానిక్‌ బటన్‌ సైతం ఉండాల్సిందే - ట్రాకింగ్‌, ప్రయాణికుల భద్రత కోసమే! హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల్లో జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌, పానిక్‌ బటన్‌ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు నిబంధనలను మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల

Most from this category