STOCKS

News


జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఈపీఎఫ్‌వో నోటీసులు

Saturday 11th May 2019
news_main1557551660.png-25671

  • ఉద్యోగుల పీఎఫ్ నిధులు 
  • జమచేయనందుకు షోకాజ్ నోటీసులు

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్‌ని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిధులు, ఇతరత్రా బకాయీలను జమ చేయనందుకు గానూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) జెట్ ఎయిర్‌వేస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మొత్తం బకాయీలపై విచారణ జరపనున్నట్లు, ప్రావిడెంట్‌ ఫండ్‌లో ఉద్యోగుల వాటాను జమ చేయనందుకు పోలీస్ కేసు పెట్టనున్నట్లు సంస్థ ఎండీకి పంపిన లేఖలో ఈపీఎఫ్‌వో ముంబై ప్రాంతీయ కార్యాలయం అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ దిలీప్ కే రాథోఢ్‌ స్పష్టం చేశారు. లేఖ ప్రకారం 2019 మార్చి నుంచి బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు, బకాయిలు చెల్లించకపోవడంతో జెట్ ఎయిర్‌వేస్‌కి అద్దెకిచ్చిన పలు కార్యాలయాలను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఎయిర్‌లైన్‌ సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలను నగదుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఏఏఐ వర్గాలు తెలిపాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్ ఏప్రిల్ 17 నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. 

జెట్‌కు బిడ్స్‌ దాఖలు...
జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు సంబంధించి ఎతిహాద్ ఎయిర్‌వేస్‌తో పాటు మరికొన్ని సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు ఎస్‌బీఐ క్యాప్స్ వెల్లడించింది. సీల్డ్ కవర్‌లో వచ్చిన బిడ్లను పరిశీలించేందుకు రుణదాతలకు సమర్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. జెట్‌లో 31.2-75 శాతం దాకా వాటాల విక్రయానికి బ్యాంకుల కన్సార్షియం బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అర్హత పొందిన సంస్థలు ఆర్థిక బిడ్లు దాఖలు చేయడానికి మే 10 (శుక్రవారం) ఆఖరు తేదీ. దీనికి అనుగుణంగా ఎతిహాద్ తదితర సంస్థల నుంచి బిడ్స్ వచ్చినట్లు బిడ్డింగ్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్‌బీఐ క్యాప్స్ పేర్కొంది. బ్యాంకులకు జెట్ ఎయిర్‌వేస్ దాదాపు రూ. 8,000 కోట్లు బాకీపడింది. ప్రస్తుతం సంస్థలో బ్యాంకులకు 51 శాతం పైగా వాటాలు ఉన్నాయి.You may be interested

6 నెలల్లో షూ మార్చేస్తున్నారు

Saturday 11th May 2019

6 నెలల్లో షూ మార్చేస్తున్నారు చెప్పులు వద్దు షూలే ముద్దంటున్న దేశీయ మిలియనీర్స్‌ సగటున ప్రతీ ఒక్కరి వద్ద 2-3 జతలు అభివృద్ధి చెందిన దేశాల్లో సగటున 6 జతల షూలు  ఈ ఏడాది రూ.1,000 కోట్ల వ్యాపార లక్ష్యం దక్షిణ భారతదేశంలో 30 ​ఫ్రాంచైజీల ఏర్పాటు వాకరూ బ్రాండ్‌ అం‍బాసిడర్‌గా అమీర్‌ఖాన్‌ ‘సాక్షి’తో వాకరూ చైర్మన్‌ వి.నౌషద్‌ సాక్షి, అమరావతి: దేశీయ యువత తక్కువ బరువు ఉన్న స్పోర్ట్‌ షూలవైపు అత్యధికంగా మొగ్గు చూపుతున్నారని, ఒకసారి విడుదలైన మోడల్‌ ఆరు

ఎస్‌బీఐ లాభం రూ.838 కోట్లు

Saturday 11th May 2019

తగ్గిన మొండి భారం  మెరుగైన రుణ నాణ్యత  రానున్నవి మంచి రోజులే ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌  న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.838 కోట్ల నికర లాభం(స్డాండ్‌అలోన్‌) సాధించింది. మొండి బకాయిలు తగ్గడం, వడ్డీ వ్యయాలు కూడా ఒక శాతం తగ్గడంతో ఈ స్థాయిలో నికర లాభం వచ్చిందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. అంతకు ముందటి ఆర్థిక

Most from this category