STOCKS

News


జపాన్‌ కంపెనీ చేతికి ఆటమ్‌ టెక్నాలజీస్‌

Wednesday 28th November 2018
news_main1543389815.png-22436

ముంబై: భారత దేశ పేమెంట్‌ సేవల మార్కెట్లోకి జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ డేటా ప్రవేశించింది. 63-మూన్స్‌ యాజమాన్యంలోని చెల్లింపుల సేవల సంస్థ, ఆటమ్‌ టెక్నాలజీస్‌లో నియంత్రిత వాటాను ఎన్‌టీటటీ డేటా కొనుగోలు చేసింది. ఆటమ్‌ టెక్నాలజీస్‌లో 55.35 శాతం వాటాను 92.4 లక్షల డాలర్లకు ఎన్‌టీటీ డేటా కొనుగోలు చేసిందని 63 మూన్స్‌ ఎమ్‌డీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎస్‌.రాజేంద్రన్‌ చెప్పారు. అంతేకాక ఈ జపాన్‌ సంస్థ మరో 15 లక్షల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసి మరింత వాటాను కొనుగోలు చేయనుందని, దీంతో ఈ వాటా 60 శాతానికి పెరుగుతుందని వివరించారు. ఈ కొనుగోలు పూర్తి కావడానికి ఐదు నెలలు పడుతుందన్నారు. 63 మూన్స్‌కు చెందిన ఇతర వ్యాపారాల్లో కూడా ఎన్‌టీటీ డేటా పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయని వివరించారు. 
లక్షన్నర మంది వ్యాపారులు...
వ్యాపారుల కోసం చెల్లింపుల ప్రాసెసింగ్‌ కార్యకలాపాలను ఆటమ్‌ టెక్నాలజీస్‌ నిర్వహిస్తోందని ఆటమ్‌ టెక్నాలజీస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ దేవాంగ్‌ నేరళ్ల చెప్పారు. వ్యాపారుల షాపుల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషీన్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసే కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నామని, తమ నెట్‌వర్క్‌లో లక్షన్నర మంది వ్యాపారులున్నారని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థకు రూ.79 కోట్ల ఆదాయం, రూ.6 కోట్ల నష్టాలు వచ్చాయని తెలియజేశారు. రూ.5,600 కోట్ల  నేషనల్‌ ‍స్పాట్‌ ఎక్స్చేంజ్‌ కుంభకోణానికి సంబంధించిన జిగ్నేశ్‌ షాకు చెందిన ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఆటమ్‌ టెక్నాలజీస్‌ను నిర్వహిస్తోంది. ఈ కుంభకోణం కారణంగా ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌ పేరును 63-మూన్స్‌గా మార్చారు. 



You may be interested

డెటెల్‌ నుంచి అత్యంత చౌక ఎల్‌సీడీ టీవీ

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత చౌకగా ఫీచర్‌ ఫోన్లు తయారు చేసే కంపెనీగా పేరున్న డెటెల్‌ తాజాగా చౌకైన ఎల్‌సీడీ టీవీని మార్కెట్లోకి తెచ్చింది. 19 అంగుళాల డీ1 ఎల్‌సీడీ టీవీని రూ.3,999 కే అందిస్తున్నామని డెటెల్‌ మొబైల్‌ అండ్‌ యాక్సెసరీస్‌ తెలిపింది. ప్రపంచంలో ఇదే అత్యంత చౌక టీవీ అని ఎస్‌జీ కార్పొరేట్‌ మొబిలిటి (డెటెల్‌ కంపెనీకి ఇది మాతృసంస్థ) ఎమ్‌డీ యోగేశ్‌ భాటియా చెప్పారు. గత ఏడాది ఆగస్టులో

యస్ బ్యాంక్ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: కొత్త సీఈవో ఎంపిక ప్రక్రియ, డైరెక్టర్ల రాజీనామాలు, కార్పొరేట్ గవర్నెన్స్‌పై వివాదాలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్‌కు తాజాగా రేటింగ్‌పరమైన ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంక్ రేటింగ్‌ను నాన్‌-ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌కి కుదించినట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. అలాగే అవుట్‌లుక్‌ కూడా స్థిర స్థాయి నుంచి నెగటివ్‌ స్థాయికి తగ్గించినట్లు మంగళవారం పేర్కొంది.  ప్రస్తుత ఎ౾ండీ, సీఈవో రాణా కపూర్ పదవీకాలాన్ని రిజర్వ్ బ్యాంక్‌ జనవరి 31 దాకా పరిమితం

Most from this category