STOCKS

News


జలాన్‌ ప్యానెల్‌ నివేదిక వాయిదా!

Monday 24th June 2019
news_main1561371923.png-26535

ఆర్‌బీఐ మిగులు నిధుల వినియోగంపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన జలాన్‌ ప్యానెల్‌ నివేదిక విడుదల వాయిదా పడింది. తొలుత ఈ నివేదిక సోమవారం విడుదల చేయాలని భావించారు. అయితే నివేదిక విడుదల వాయిదా పడినట్లు రాయిటర్స్‌ వార్త సంస్థ తెలిపింది. ఇలా వాయిదా పడడం ఇది నాలుగోసారి. ప్యానెల్‌లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ జలాన్‌తో పాటు ఆరుగురు సభ్యులుంటారు. ఏప్రిల్‌లో ఈ ప్యానెల్‌ తన నివేదిక విడుదల చేయాల్సిఉంది. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో నివేదిక విడుదల వాయిదా పడుతూ వస్తోంది. జూలైలో బడ్జెట్‌ అనంతరం నివేదిక విడుదలయ్యే ఛాన్సులున్నాయి. గతేడాది డిసెంబర్‌లో ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. జనవరిలో ప్యానెల్‌ తొలి సమావేశం జరిగింది. ఏర్పాటైన 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిఉంది. అప్పటినుంచి నివేదిక విడుదల తేదీలను పొడిగించుకుంటూ వస్తున్నారు. కమిటీలో రాకేశ్‌ మోహన్‌, సుబాష్‌ చంద్ర గార్గ్‌, ఎన్‌ఎస్‌ విశ్వనాధన్‌, భరత్‌ దోషి, సుధీర్‌ మన్కడ్‌ ఉన్నారు. 



You may be interested

మార్కెట్లో దూకుడొద్దు!

Monday 24th June 2019

సెంట్రమ్‌బ్రోకింగ్‌ సీఈఓ నిశ్చల్‌ మహేశ్వరి సూచన ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీల్లో తొందరపడడం మంచిది కాదని, దూకుడుగా పోర్టుఫోలియో తయారు చేసుకోవాలన్న ఆలోచనకు తాను వ్యతిరేకమని మార్కెట్‌ నిపుణుడు, సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీఈఓ నిశ్చల్‌ మహేశ్వరి చెప్పారు. ఈ పరిస్థితుల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌సైతం క్యాపిటల్‌ కాపాడుకునేలా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, రూరల్‌ బ్యాంక్స్ స్టాకులను నమ్ముకోవడం మంచిదన్నారు. గతంలో దేశీయంగా డిమాండ్‌ తగ్గినప్పుడల్లా అంతర్జాతీయంగా ఎగుమతులు పెరుగుతుండేవని, కానీ ఈ దఫా అటు డిమాండ్‌,

11700 దిగువన నిఫ్టీ ముగింపు

Monday 24th June 2019

బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 11700 దిగువున 11,699 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 71 పాయింట్లను నష్టపోయి 39,123 వద్ద ముగిసింది. ఇరాన్‌ అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టకపోవడం, క్రూడాయిల్‌ ధరలు చల్లారకపోవడం తదితర బలహీన అంతర్జాతీయ సంకేతాలు దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఇక

Most from this category