జేఎల్ఆర్లో ఉద్యోగాల కోత
By Sakshi

న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్‌లో భాగమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) .. ఉత్పత్తి కార్యకలాపాల క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టింది. దీంతో సెంట్రల్ ఇంగ్లండ్‌లోని వోల్వర్‌హాంప్టన్ ప్లాంటులో సుమారు 250 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించనుంది. డిసెంబర్లో రెండు వారాల పాటు ఈ ప్లాంటులో ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు కూడా జేఎల్ఆర్ తెలిపింది. దీంతో 500 మంది ఉద్యోగులు రోజువారీ విధులకు హాజరు కానక్కర్లేదని, అయితే ఈ వ్యవధిలో వారి జీతభత్యాలు యథాప్రకారం చెల్లిస్తామని వివరించింది. అంతర్జాతీయంగా పరిస్థితులు సమస్యాత్మకంగా మారుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్వహణ సామర్ధ్యాలను మెరుగుపర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జేఎల్ఆర్ తెలిపింది. విద్యుత్ వాహనాల్లో విస్తృత శ్రేణిని అందుబాటులోకి తెచ్చేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని, వ్యాపార పరిణామ క్రమంలో ఇలాంటివి తప్పవని వివరించింది. అంతర్జాతీయంగా డిమాండ్‌లో హెచ్చుతగ్గులకు తగ్గట్లుగా ఉత్పత్తిలో కూడా మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు జేఎల్ఆర్ పేర్కొంది. వీటివల్ల కస్టమర్ల ఆర్డర్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది. కీలకమైన యూరప్, చైనా మార్కెట్లలో సవాళ్లెదుర్కొంటున్న బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థ.. స్లొవేకియాలో 1.4 బిలియన్ యూరోలతో వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. వార్షికంగా 1.50 లక్షల కార్ల తయారీ సామర్ధ్యంతో దీన్ని నెలకొల్పింది. తాజా పరిణామాలతో దేశీయంగా బీఎస్ఈలో టాటా మోటార్స్ షేరు సుమారు 3 శాతం క్షీణించి రూ. 172.20 వద్ద క్లోజయ్యింది.
You may be interested
అమెరికాలో భారత నారీ భేరి
Saturday 1st December 2018న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళలు కూడా టెక్నాలజీ రంగంలో విజయపతాకం ఎగురవేస్తున్నారు. ఫోర్బ్స్ సంస్థ 2018 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ‘అమెరికాలో అగ్ర స్థాయి 50 మంది టెక్నాలజీ ప్రముఖుల’ జాబితాలో భారత సంతతికి చెందిన నలుగురు మహిళలు చోటు దక్కించుకోవటమే దీనికి నిదర్శనం. సిస్కో మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్, ఉబెర్ సీనియర్ డైరెక్టర్ కోమల్ మంగ్తాని, కన్‌ఫ్లూయంట్ సహ వ్యవస్థాపకురాలు నేహ
ఐడీఎఫ్సీ బ్యాంక్ పేరు మారుతోంది
Saturday 1st December 2018న్యూఢిల్లీ: ఐడీఎఫ్సీ బ్యాంక్ పేరు మారనుంది. తన పేరును ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌గా మార్చుకోవడానికి వాటాదారుల ఆమోదాన్ని ఈ బ్యాంక్ కోరనుంది. ఈ పేరు మార్పు ప్రతిపాదనకు ఐడీఎఫ్సీ బ్యాంక్ వాటాదారులు డిసెంబరు 4 నుంచి జనవరి 2 మధ్య ఓటేయవచ్చు. క్యాపిటల్ ఫస్ట్, క్యాపిటల్ ఫస్ట్ హోమ్ ఫైనాన్స్, క్యాపిటల్ ఫస్ట్ సెక్యూరిటీస్ సంస్థలు ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో విలీనం కానుండటంతో బ్యాంకు ఈ పేరు మార్పు ప్రతిపాదనను చేసింది. ఈ