News


జేఎల్‌ఆర్‌లో 4,500 ఉద్యోగాల కోత

Friday 11th January 2019
news_main1547185875.png-23525

లండన్‌: టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌).. భారీ స్థాయిలో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అంతర్జాతీయంగా మొత్తం 4,500 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. చైనాలో అమ్మకాలు తగ్గడం, బ్రెగ్జిట్‌ అంశం కారణంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు జేఎల్‌ఆర్‌ సీఈఓ రాల్ఫ్‌ స్పెత్‌ వివరణ ఇచ్చారు. ‘సంస్థ దీర్ఘకాల మనుగడ కోసం ఈ నిర్ణయాత్మక చర్య తీసుకున్నాం. అనేక భౌగోళిక రాజకీయ అంశాలు, నియంత్రణాపరమైన అంతరాయాలు ఈ పరిస్థితికి కారణమయ్యాయి. మరోవైపు ఆటోమోటివ్ పరిశ్రమ సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటోంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక గతేడాదిలో 1,500 మంది ఉద్యోగులు సంస్థకు టాటా చెప్పారు.

4.6% తగ్గిన అమ్మకాలు
గతేడాది అంతర్జాతీయ అమ్మకాలు 4.6 శాతం క్షీణించినట్లు జేఎల్‌ఆర్‌ ప్రకటించింది. 2018లో మొత్తం 5,92,708 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. అంతక్రితం ఏడాదితో పోల్చితే గతేడాదిలో జాగ్వార్‌ బ్రాండ్‌ అమ్మకాలు 1.2 శాతం వృద్ధి చెందగా.. ల్యాండ్‌ రోవర్‌ సేల్స్‌ 6.9 శాతం తగ్గాయి. 2018లో వరుసగా వీటి అమ్మకాలు 1,80,833 యూనిట్లు, 4,11,875 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది.



You may be interested

ఐటీసీ టార్గెట్‌ పెంచిన సీఎల్‌ఎస్‌ఏ

Friday 11th January 2019

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తాజాగా దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ టార్గెట్‌ను పెంచింది. గతంలో ఇచ్చిన కొనొచ్చు రేటింగ్‌ కొనసాగిస్తూ టార్గెట్‌ను రూ. 390 నుంచి రూ. 400కి పెంచింది. పొగాకుపై పన్నుల్లో కొత్త మార్పులు లేకపోవడంతో టార్గెట్‌ను పెంచినట్లు తెలిపింది. ప్రస్తుత ధరతో పోలిస్తే కొత్త టార్గెట్‌ సుమారు 38 శాతం ఎక్కువ. గత 18నెలల్లో జీఎస్‌టీ కౌన్సిల్‌ దాదాపు 13 దఫాలు సమావేశమయింది. కానీ టొబాకో

జపాన్‌తో కరెన్సీ మార్పిడి ఒప్పందం

Friday 11th January 2019

పచ్చజెండా ఊపిన కేం‍ద్ర కేబినెట్‌ కరెన్సీ విలువల్లో అస్థిరతలు తగ్గించడమే లక్ష్యం న్యూఢిల్లీ: జపాన్‌, భారత్‌ మధ్య మరో కీలక ఒప్పందానికి వీలుగా కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కరెన్సీ విలువల్లో అస్థిరతలకు చెక్‌ పెట్టేందుకు గాను జపాన్‌తో 75 బిలియన్‌ డాలర్ల మేర ద్వైపాక్షిక స్వాప్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీ ఆమోదం తెలిపింది. రెండు దేశాల మధ్య గరిష్టంగా 75 బిలియన్‌ డాలర్ల

Most from this category