STOCKS

News


ఐవీఆర్‌సీఎల్‌ దివాలా ప్రక్రియ గడువు 7 రోజుల పెంపు

Thursday 22nd November 2018
news_main1542865600.png-22299

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:  హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్నున్న మౌలిక రంగ సంస్థ- ఐవీఆర్‌సీఎల్‌ దివాలా ప్రక్రియ (సీఐపీఆర్‌- కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్‌ ప్రాసెస్‌) గడువును నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌, హైదరాబాద్‌ బెంచ్‌ ఏడు రోజులు పొడిగించింది. దీనితో ఈ నెల 27 వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. వివరాల్లోకి వెళితే, దివాలా ప్రక్రియకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 23న ట్రిబ్యునల్‌ అడ్మీట్‌ చేసి తగిన ఆదేశాలు ఇచ్చింది. దీనిప్రకారం 270 రోజుల్లో అంటే నవంబర్‌ 20వ తేదీకల్లా కంపెనీకి సంబంధించి సీఐపీఆర్‌ పూర్తికావాల్సి ఉంది. అయితే సంబంధిత ఉత్తర్వ్యు ప్రతి రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌కు ఏడు రోజలు ఆలస్యంగా అందింది. దీనితో సీఐపీఆర్‌ ప్రక్రియ మరో ఏడురోజుల పొడిగింపునకు ఎస్‌బీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని ఆమోదిస్తూ, ఈ నెల 19వ తేదీన ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు పంపిన ఒక ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. విచారణ తదుపరి విచారణ నవంబర్‌ 26వ తేదీకి వాయిదా పడింది. 
రిజల్యూషన్‌ ప్లాన్‌కు సీఓసీ తిరస్కృతి!
కాగా ఈ నెల  20 వతేదీన క్రెడిటార్స్‌ కమిటీ (సీఓసీ) సభ్యులు సమావేశమై, సంబంధిత రిజల్యూషన్‌ ప్లాన్‌ అప్లికేషన్‌ను ఏకగ్రీవంగా తిరస్కరించినట్లు కూడా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈకి సమర్పించిన నోట్‌లో ఐవీఆర్‌సీఎల్‌ తెలిపింది.  ఈ నిర్ణయాన్ని తెలియజేస్తూ, సీఐపీఆర్‌ ప్రక్రియ గడువు తేదీలోపు ఎన్‌సీఎల్‌టీలో తగిన అప్లికేషన్‌ను దాఖలు చేయాలని రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌కు సీఓసీ విజ్ఞప్తి చేసినట్లు వివరించింది. 



You may be interested

టాప్‌-100లో ముగ్గురు హైదరాబాదీ రియల్టర్లు

Thursday 22nd November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలతో పాటు ఈ రంగంలో సంపదను సృష్టిస్తున్న శ్రీమంతులూ పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా టాప్‌-15 మంది రియల్టీ కుబేరుల్లో తెలంగాణ నుంచి ‘మై హోమ్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌’ అధినేత జూపల్లి రామేశ్వర్‌ రావు తొలిసారిగా స్థానం దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా రియల్టీ దిగ్గజాల్లో ఈయన 14వ స్థానంలో నిలిచారు. ఈ మేరకు ‘గ్రోహె- హురున్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌’ 2018వ సంవత్సరానికి సంబంధించిన జాబితా విడుదల చేసింది.  హైదరాబాద్‌ నుంచి

సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ ఇండియా హెడ్‌గా సుమర్‌ జునేజా

Thursday 22nd November 2018

న్యూఢిల్లీ: జపాన్‌ దిగ్గజ సంస్థ, సాఫ్ట్‌బ్యాంక్‌ తన విజన్‌ ఫండ్‌ భారత అధినేతగా సమర్‌ జునేజాను నియమించింది.  భారత్‌లో విజన్‌ ఫండ్‌ కార్యకలాపాలను జునేజా నిర్వహిస్తారని సాఫ్ట్‌బ్యాంక్‌ వెల్లడించింది. సాఫ్ట్‌బ్యాంక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ ద్వారా వివిధ స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తోంది. ఈ ఫండ్‌ ఇప్పటికే భారత్‌కు చెందిన నాలుగు పెద్ద స్టార్టప్‌ల్లో 500 కోట్ల డాలర్ల వరకూ ఇన్వెస్ట్‌ చేసింది. ఓయో, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎమ్‌,

Most from this category