STOCKS

News


ఐటీసీ ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Monday 13th May 2019
news_main1557730654.png-25706

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ సోమవారం ఫలితాలు ప్రకటించనుంది. ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు, అభిప్రాయాలు ఇలా ఉన్నాయి..
- ఐసీఐసీఐ డైరెక్ట్‌: నికర లాభం పదిశాతం పెరిగి రూ. 3226.5 కోట్లకు చేరవచ్చు. నికర విక్రయాల్లో 8.3 శాతం వృద్ధి ఉండొచ్చు. ఎబిటాలో 9.9 శాతం మెరుగుదల అంచనా. 
- కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌: స్టాండలోన్‌ లాభం 7.8 శాతం పెరిగి రూ. 3160.4 కోట్లకు చేరవచ్చు. నికర విక్రయాల్లో 7.4 శాతం, ఎబిటాలో 9.2 శాతం మెరుగుదల ఉండవచ్చు. 
- ఎమ్‌కే గ్లోబ్‌: సిగిరెట్‌ ఎబిటాలో 9 శాతం వృద్ధి అంచనా. సిగిరెట్‌ రెవెన్యూ సైతం 9 శాతం పెరగవచ్చు. వాల్యూంల్లో 6 శాతం పెరుగుదల ఉండొచ్చు. మొత్తం ఎబిటా 11 శాతం మేర పెరగవచ్చు. 
- నార్నోలియా రిసెర్చ్‌: విక్రయాలకు సిగిరెట్‌ విభాగం దన్నుగా నిలుస్తుంది. దీంతో 17 శాతం పెరుగుదల విక్రయాల్లో ఉండొచ్చు. సిగరెట్‌, ఎఫ్‌ఎంసీజీ, హోటల్‌ వ్యాపారాల రెవెన్యూ వరుసగా 10, 15, 15 శాతం పెరగవచ్చు. స్థూల మార్జిన్లు 19 బీపీఎస్‌ పెరిగి 62.4 శాతానికి చేరతాయని అంచనా. ఎబిటాలో 16 శాతం వృద్ధి ఉండొచ్చు. 


ITC

You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ లాభం 27 శాతం అప్‌

Monday 13th May 2019

మార్చి త్రైమాసికానికి హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం 27 శాతం పెరిగి రూ. 2861.6 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 2256.68 కోట్ల లాభం నమోదు చేసింది. సమీక్షా కాలంలో కంపెనీ రెవెన్యూ రూ. 11586 కోట్లను చేరింది. కంపెనీ కొత్త అకౌంటింగ్‌ ప్రమాణాలకు మారినందున ఈ ఫలితాలను గత ఫలితాలతో పోల్చలేము. కంపెనీ స్థూల ఎన్‌పీఏలు 1.22 శాతం నుంచి 1.18 శాతానికి దిగివచ్చాయి. క్యు4లో కంపెనీ

సీపీఎస్‌ఈల్లో వాటాల విక్రయంపై కేంద‍్రం కసరత్తు

Monday 13th May 2019

  ప్రక్రియ నాలుగు నెలల్లో పూర్తి చేయడంపై దృష్టి లిస్టులో ఎయిరిండియా, స్కూటర్స్ ఇండియా, బీఈఎంఎల్ మొదలైన సంస్థలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈ) వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆసక్తి గల ఇన్వెస్టర్లకు సమాచార పత్రాలు జారీ చేసిన నాలుగు నెలల్లోగా విక్రయ ప్రక్రియ పూర్తయ్యేలా చేయడంపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. "ప్రస్తుతం వ్యూహాత్మక వాటాల విక్రయానికంటూ విధానం అమల్లో ఉన్నప్పటికీ..

Most from this category