STOCKS

News


ఐటీసీ లాభంలో 18 శాతం వృద్ధి

Monday 13th May 2019
news_main1557741562.png-25711

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ మార్చి త్రైమాసికంలో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించింది. కంపెనీ నికరలాభం 18 శాతం పెరిగి రూ. 2932.7 కోట్ల నుంచి రూ. 3482 కోట్లను చేరింది. ఇదే సమయంలో రెవెన్యూ 13 శాతం పెరిగి రూ. 11992 కోట్లను చేరింది. కంపెనీ ఎబిటా రూ. 4572 కోట్లకు చేరగా మార్జిన్లు 38.1 శాతంగా నమోదయ్యాయి. కంపెనీ సిగరెట్‌ విక్రయాలు 11 శాతం పెరుగుదలతో రూ. 5486కోట్లను చేరాయి. సిగరెట్‌ ఎబిటా 10 శాతం పెరిగి రూ. 3856 కోట్లను, మార్జిన్లు 70.3 శాతాన్ని చేరాయి. కంపెనీ ఎఫ్‌ఎంసీజీ ఆదాయం 9.7 శాతం పెరుగుదలతో రూ. 8760 కోట్లను తాకింది. ఎఫ్‌ఎంసీజీ ఎబిటా 12.8 శాతం వృద్ధితో రూ. 4057 కోట్లకు, మార్జిన్లు 46. 3శాతానికి చేరాయి. అగ్రివ్యాపారాదాయంలో 16 శాతం పెరుగుదల నమోదయింది. కొత్త చైర్మన్‌గా ప్రస్తుత ఎండీ సంజీవ్‌ పురిని బోర్డు నియమించింది. ఇకపై పురి ఐటీసీకి చైర్మన్‌, ఎండీగా కొనసాగుతారు. ఈరోజే ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఫలితాల సందర్భంగా ఒక్కోషేరుపై కంపెనీ రూ. 5.75 డివిడెండ్‌ను ప్రకటించింది. మార్కెట్‌ ముగిసే సమయానికి ఐటీసీ షేరు దాదాపు 3 శాతం నష్టంతో రూ.288- 289 వద్ద కదలాడుతోంది. 


ITC

You may be interested

తొమ్మిదో రోజూ ఆగని నష్టాలు

Monday 13th May 2019

11150 దిగువకు నిఫ్టీ  372 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌  మార్కెట్‌కు నష్టాల కష్టాలు వీడటం లేదు. వరుసగా తొమ్మిదో రోజూ సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 372 పాయింట్ల కోల్పోయి 37,091 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11180 స్థాయిని కోల్పోయి 131 పాయింట్ల నష్టంతో 11,148 వద్ద ముగిసింది. సూచీలు వరుసగా 9 ట్రేడింగ్‌ సెషన్లలో నష్టాలు చవిచూడటం 8 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. మార్కెట్లో చివరి గంటలో

స్వల్పకాలానికి సిఫార్సులు

Monday 13th May 2019

వచ్చే రెండు మూడు వారాల సమయానికి మంచి రాబడినిచ్చే స్టాకులను ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి. ఎపిక్‌ రిసెర్చ్‌ సిఫార్సులు 1. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1430. స్టాప్‌లాస్‌ రూ. 1360. స్టాకు అప్‌ట్రెండ్‌లో ఉంది. హయ్యర్‌హై, లో ఏర్పరుస్తూ సాగుతోంది. తాజాగా వచ్చిన స్వల్పకాలిక పతనంలో 20 రోజుల డీఎంఏ వద్ద మద్దతు తీసుకుంది. ఈ స్థాయిల నుంచి త్వరలో అప్‌మూవ్‌ కొనసాగించనుంది. 2. ఎంఅండ్‌ఎం: కొనొచ్చు.

Most from this category