STOCKS

News


ఐటీసీ లాభం రూ.2,955 కోట్లు

Saturday 27th October 2018
news_main1540610644.png-21520

న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన రూ.2,955 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.2,640 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. ఎఫ్‌ఎమ్‌సీజీ, సిగరెట్లు, వ్యవసాయ, పేపర్‌ విభాగాలు మంచి వృద్ధి సాధించాయని కంపెనీ తెలియజేసింది. స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన గత క్యూ2లో రూ.10,258 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.11,777 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.6,314 కోట్ల నుంచి రూ.7,408 కోట్లకు చేరాయి. 
ప్రతికూలతలున్నా... మంచి పనితీరు...
సిగరెట్‌ పరిశ్రమపై తీవ్రమైన ఒత్తిడి కొనసాగుతుండటం, వ్యాపార పరిస్థితులు సమస్యాత్మకంగా ఉండటం వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ, మంచి పనితీరు సాధించామని ఐటీసీ తెలిపింది. వివిధ విభాగాల పనితీరును చూస్తే... ఎఫ్‌ఎమ్‌సీజీ వ్యాపారం ఆదాయం రూ.7,358 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.8,186 కోట్లకు, మొత్తం ఆదాయంలో 45 శాతం వాటా ఉండే సిగరెట్ల విభాగం వ్యాపారం రూ.4,554 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.5,026 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలియజేసింది. ఎఫ్‌ఎమ్‌సీజీ-యేతర వ్యాపార విభాగం రూ.2,804 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.3,160 కోట్లకు, హోటళ్ల వ్యాపారం ఆదాయం రూ.300 కోట్ల నుంచి రూ.363 కోట్లకు చేరుకుంది. ఇక వ్యవసాయ విభాగం ఆదాయం రూ.1,968 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.2,220 కోట్లకు పెరిగింది. సిగరెట్ల వ్యాపారం ఎబిటా 9 శాతం పెరిగిందని, అయితే మార్జిన్‌ మాత్రం 10 బేసిస్‌ పాయింట్లు తగ్గిందని తెలిపింది. ఎఫ్‌ఎమ్‌సీజీ ఎబిటా 10 శాతం పెరిగి రూ.3,638 కోట్లకు చేరిందని, మార్జిన్‌ మాత్రం 60 బేసిస్‌ పాయింట్లు తగ్గిందని పేర్కొంది. మొత్తం మీద కంపెనీ ఎబిటా 12 శాతం పెరిగి రూ.4,206 కోట్లకు, మార్జిన్‌ 1.5 శాతం వృద్దితో 38 శాతానికి పెరిగిందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐటీసీ షేర్లు 2.3 శాతం నష్టంతో రూ.281 వద్ద ముగిసింది. 

.


ITC

You may be interested

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.487 కోట్లు

Saturday 27th October 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌కు (ఐఓబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.487 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో, ఈ క్యూ1లో వచ్చిన నష్టాలను పరిగణనలోకి తీసుకున్నా, ఈ బ్యాంక్‌ నష్టాలు బాగా తగ్గాయి. గత క్యూ2లో ఈ బ్యాంక్‌కు రూ.1,223 కోట్లు, ఈ క్యూ1లో రూ.919 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొండి బకాయిలు, ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం కేటాయింపుల కారణంగానే నికర

ఫండ్స్‌ నుంచి బ్యాంకుల్లోకి రూ.2 లక్షల కోట్లు

Saturday 27th October 2018

ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ సంక్షోభం తర్వాత ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల నుంచి రూ.2 లక్షల కోట్ల మేర ఉపసంహరించుకోగా... ఇవి బ్యాంకుల్లోకి చేరాయి. ఈ నిధులు ఇతర బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలు) మద్దతుగా నిలుస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ఈ విషయాన్ని ఒక నివేదికలో తెలియజేశారు. ‘‘ఇన్వెస్టర్లు లిక్విడ్‌ ఫండ్స్‌, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌ నుంచి ఈ స్థాయిలో నిధులను వెనక్కి తీసుకున్నారు. ఈ

Most from this category