STOCKS

News


మార్కెట్‌ను మెప్పించని ఐటీసీ ఫలితాలు

Thursday 24th January 2019
news_main1548304352.png-23769

- క్యూ3లో 4 శాతం పెరిగిన లాభం
- 3,090 కోట్ల నుంచి రూ.3,209 కోట్లకు
- 1 శాతానికి పైగా తగ్గిన మార్జిన్లు
- ఆదాయంలో సిగరెట్ల వాటా సగానికన్నా తక్కువే

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ, వ్యవసాయోత్పత్తుల విభాగాల ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వ్యాపార దిగ్గజం ఐటీసీ నికర లాభం 4 శాతం పెరిగి రూ. 3,209 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌- డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 3,090 కోట్లు. "క్యూ3లో స్థూల ఆదాయం రూ. 15 శాతం పెరిగి రూ. 9,853 కోట్ల నుంచి రూ.11,340 కోట్లకు చేరింది. ఎఫ్‌ఎంసీజీ, అగ్రి బిజినెస్‌, పేపర్‌బోర్డ్స్‌, పేపర్‌, ప్యాకేజింగ్ తదితర విభాగాలు రాణించడం ఇందుకు తోడ్పడింది" అని ఐటీసీ పేర్కొంది. సిగరెట్స్ విభాగంలో పెను సవాళ్లు ఎదురైనప్పటికీ పరిశ్రమలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగామని ఐటీసీ తెలిపింది. మూడో త్రైమాసికంలో వ్యయాలు 17 శాతం పెరిగి రూ. 7,446 కోట్లకు చేరాయి. స్థూల లాభం 11.2 శాతం పెరిగినా.. అధిక వ్యయాల కారణంగా మార్జిన్లు 39.8 శాతం నుంచి 38.5 శాతానికి తగ్గాయి. పరిశ్రమవర్గాలు 40 శాతంగా ఉండొచ్చని అంచనా వేశాయి.
విభాగాలవారీగా ఆదాయాలు చూస్తే ..
- మొత్తం ఎఫ్‌ఎంసీజీ వ్యాపార ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 7,501 కోట్ల నుంచి రూ. 8,274 కోట్లకు పెరిగింది. ఇందులో సిగరెట్స్‌ వ్యాపార విభాగం ఆదాయం సుమారు 10 శాతం పెరిగి రూ. 5,073 కోట్లకు చేరింది. ఇతరత్రా ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల విభాగం 11 శాతం పెరిగి రూ. 3,201 కోట్లకు చేరింది. పిండి, స్నాక్స్‌, ప్రీమియం క్రీమ్ బిస్కట్స్, నూడుల్స్‌, క్లాస్‌మేట్ నోట్‌బుక్స్‌, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు మొదలైన వాటి అమ్మకాలు పెరగడం ఇందుకు దోహదపడింది.
- ఐటీసీ హోటల్ వ్యాపార ఆదాయం 12 శాతం పెరిగి రూ. 452 కోట్లకు చేరింది. సగటు రూమ్ రేటు (ఏఆర్‌ఆర్‌) మెరుగుపడటం దీనికి తోడ్పడింది.
- అగ్రిబిజినెస్ వ్యాపార విభాగం 26 శాతం ఎగిసి రూ. 1,531 కోట్ల నుంచి రూ. 1925 కోట్లకు చేరింది.
- పేపర్‌బోర్డ్స్‌, పేపర్‌, ప్యాకేజింగ్ విభాగం ఆదాయం 21 శాతం పెరిగి రూ. 1,543 కోట్లుగా నమోదైంది.



You may be interested

జీఎస్టీపై అప్పీళ్లకు ట్రిబ్యునల్‌ నేషనల్‌ బెంచ్‌

Thursday 24th January 2019

జీఎస్టీపై అప్పీళ్లకు ట్రిబ్యునల్‌ నేషనల్‌ బెంచ్‌ సార్క్‌ దేశాలతో కరెన్సీ స్వాప్‌ ఆహార రంగంలో జపాన్‌తో సహకారం కేంద్ర కేబినెట్‌ భేటీలో నిర్ణయాలు న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో జీఎస్టీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఏదైనా అంశంలో వివాదం ఏర్పడితే రెండో అప్పీలు చేసుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నది కేంద్రం ఉద్దేశం. రాష్ట్రాల స్థాయిలో భిన్న తీర్పులు వచ్చిన కేసులను సైతం జీఎస్టీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ నేషనల్‌ బెంచ్‌ విచారిస్తుంది.

‘ఇంటి’ని చక్కదిద్దరూ..!

Thursday 24th January 2019

- ఎన్నో రియల్టీ ప్రాజెక్టులు నిలిచిపోయాయి - పూర్తి చేయటంలో జోక్యం చేసుకోండి - రూ.2,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేయండి - ఈ బడ్జెట్‌లో ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వండి - కేంద్రాన్ని కోరిన ‘నారెడ్కో’ న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌లో తమ డిమాండ్లకు చోటు కల్పించాలని పలు రంగాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎన్నో ప్రాజెక్టులు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈఎంఐలు చెల్లిస్తూ ఇంటి స్వాధీనం కోసం కొనుగోలుదారులు

Most from this category