News


ఐటీసీ టార్గెట్‌ పెంచిన సీఎల్‌ఎస్‌ఏ

Friday 11th January 2019
news_main1547186074.png-23526

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తాజాగా దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ టార్గెట్‌ను పెంచింది. గతంలో ఇచ్చిన కొనొచ్చు రేటింగ్‌ కొనసాగిస్తూ టార్గెట్‌ను రూ. 390 నుంచి రూ. 400కి పెంచింది. పొగాకుపై పన్నుల్లో కొత్త మార్పులు లేకపోవడంతో టార్గెట్‌ను పెంచినట్లు తెలిపింది. ప్రస్తుత ధరతో పోలిస్తే కొత్త టార్గెట్‌ సుమారు 38 శాతం ఎక్కువ. గత 18నెలల్లో జీఎస్‌టీ కౌన్సిల్‌ దాదాపు 13 దఫాలు సమావేశమయింది. కానీ టొబాకో టాక్సులపై ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. త్వరలో ఎన్నికలు రానున్నందున స్వల్పకాలానికి జీఎస్‌టీ పన్నుల్లో మార్పులు ఉండకపోవచ్చని అంచనా వేసింది. అందువల్ల ఐటీసీకి కొనొచ్చు రేటింగ్‌తో పాటు మరో పదిరూపాయల అదనపు టార్గెట్‌ను నిర్ణయించినట్లు వివరించింది. ప్రస్తుతం స్టాకు రిస్కురివార్డు నిష్పత్తి ఆకర్షణీయంగా ఉందని, డౌన్‌సైడ్‌ రక్షణ ఇస్తుందని తెలిపింది. గత 9 నెలల్లో ఐటీసీ దాదాపు 10 శాతం లాభపడింది. శుక్రవారం ట్రేడింగ్‌లో సుమారు 2 శాతం లాభంతో ట్రేడవుతోంది. 


ITC

You may be interested

టీసీఎస్‌ రికార్డు లాభాలు

Friday 11th January 2019

ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) బంపర్‌ లాభాలతో క్యూ3 సీజన్‌కు బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లాభం 24.1 శాతం ఎగిసి రూ. 8,105 కోట్లకు పెరిగింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 8,000 కోట్ల మైలురాయి దాటడం ఇదే ప్రథమం. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నికర లాభం రూ.6,531 కోట్లు. మరోవైపు, ఆదాయం కూడా 20.8

జేఎల్‌ఆర్‌లో 4,500 ఉద్యోగాల కోత

Friday 11th January 2019

లండన్‌: టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌).. భారీ స్థాయిలో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అంతర్జాతీయంగా మొత్తం 4,500 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. చైనాలో అమ్మకాలు తగ్గడం, బ్రెగ్జిట్‌ అంశం కారణంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు జేఎల్‌ఆర్‌ సీఈఓ రాల్ఫ్‌ స్పెత్‌ వివరణ ఇచ్చారు. ‘సంస్థ దీర్ఘకాల మనుగడ కోసం ఈ నిర్ణయాత్మక చర్య తీసుకున్నాం. అనేక భౌగోళిక రాజకీయ

Most from this category