STOCKS

News


ఐటీసీ ఛైర్మన్‌ దేవేశ్వర్ కన్నుమూత

Saturday 11th May 2019
Markets_main1557560438.png-25683

కార్పోరేట్‌ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్‌ వైసీ దేవేశ్వర్‌(72) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. దేవేశ్వర్‌ ఫిబ్రవరి 4, 1947లో లాహోర్‌ జన్మించారు. ఐఐటీ డిల్లీలో, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఐటీసీ కంపెనీలో 1968లో సామాన్య ఉద్యోగిగా తన జీవితాన్ని మొదలుపెట్టారు. అంచెంచెలుగా ఎదుగుతూ 1996 నాటికి కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ స్థాయికి చేరుకున్నారు. 2017లో కంపెనీ నాన్‌ ఎగ్జూక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవిని అలంకరించారు. ఐటీసీని ఒక ఎఫ్‌ఎంసీజీగా మలిచిన ఘనత దేవేశ్వర్‌కే దక్కుతుంది. ఐటీసీ అతిపెద్ద షేర్‌హోల్డర్‌ బీఎటీ(బ్రిటీష్‌ అమెరికన్‌ టొబాకో) టేకోవర్‌ ప్రమాదం నుంచి గట్టేందుకు ఆయనెంతో కృషి చేశారు. ఐటీసీకి దేవేశ్వర్‌ అందించిన సేవలకు గుర్తింపుగా 2018 జనవరిలో కంపెనీ ఆయన్ను 2022 వరకు ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 2011లో పద్మభూషణ్‌ అవార్డును అందుకొన్నారు. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా 2108లో లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించింది.



You may be interested

11300పైన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 11th May 2019

విదేశీ మార్కెట్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచి శుక్రవారం రాత్రి 17.50 పాయింట్లు లాభపడి 11,301.00 పాయింట్ల  వద్ద ముగిసింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు  శుక్రవారం ముగింపు 11307.20 తో పోలిస్తే 6 పాయింట్ల నష్టంతో ఉంది. ఇక శుక్రవారం సెన్సెక్స్‌ 96 పాయింట్లు నష్టపోయి 37,463 వద్ద నిఫ్టీ 23 పాయింట్లు తగ్గి 11,279 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా అమెరికా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం,

తగ్గిన కెనరా బ్యాంకు నష్టాలు

Saturday 11th May 2019

మార్చి క్వార్టర్లో రూ.551కోట్లకు పరిమితం గణనీయంగా తగ్గిన మొండి బకాయిలు న్యూఢిల్లీ: కెనరా బ్యాంకు నష్టాలు మార్చి త్రైమాసికంలో చాలా వరకు తగ్గాయి. 2017-18 మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ.4,859 కోట్ల నష్టాలను ఎదుర్కోగా, 2018-19 మార్చి త్రైమాసికం నాటికి నష్టాలను రూ.551 కోట్లకు తగ్గించుకుంది. ఎన్‌పీఏలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు కారణమైంది. మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ.14,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో వచ్చిన రూ.11,555

Most from this category