News


ఐటీసీ కొత్త ఛైర్మన్‌గా సంజీవ్ పురి

Monday 13th May 2019
news_main1557745139.png-25713

ఐటీసీ నూతన ఛైర్మన్‌గా సంజీవ్‌పురి నియమితులయ్యారు. గత కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్న దేవేశ్వర్‌(72) శనివారం తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు నేడు కంపెనీ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. సంజీవ్‌పురి ఐఐటీ ఖరగ్‌పూర్‌, వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఐటీసీలో 1986లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సంజీవ్‌ వివిధ విభాగాల్లో కంపెనీకి సేవలు అందిస్తున్నారు. ఐటీసీ అనుంబంధ సంస్థలైన ఇన్ఫోటెక్‌, సూర్య నేపాల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 2018 నుంచి కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. 



You may be interested

ఎన్నికలైతే తిరిగి విదేశీ నిధుల రాక: ట్రేడింగ్‌బెల్స్‌ 

Tuesday 14th May 2019

మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే కనీసం పదేళ్ల కాలాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ట్రేడింగ్‌బెల్స్‌ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్‌గుప్తా సూచించారు. ఎన్నికల ఫలితాలు వెలువడి, ఓ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తే తిరిగి విదేశీ నిధులు దండిగా వస్తాయని అభిప్రాయపడ్డారు. ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ సందర్భంగా వివిధ అంశాలపై ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.  ఎన్నికల ముందు ఇన్వెస్టర్ల ముందున్న మార్గం? ఎటుంటి సానుకూల ట్రిగ్గర్లు లేకపోవడంతో సూపర్‌ ట్రెండ్‌, ఎంఏసీడీ సెల్‌

తొమ్మిదో రోజూ ఆగని నష్టాలు

Monday 13th May 2019

11150 దిగువకు నిఫ్టీ  372 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌  మార్కెట్‌కు నష్టాల కష్టాలు వీడటం లేదు. వరుసగా తొమ్మిదో రోజూ సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 372 పాయింట్ల కోల్పోయి 37,091 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11180 స్థాయిని కోల్పోయి 131 పాయింట్ల నష్టంతో 11,148 వద్ద ముగిసింది. సూచీలు వరుసగా 9 ట్రేడింగ్‌ సెషన్లలో నష్టాలు చవిచూడటం 8 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. మార్కెట్లో చివరి గంటలో

Most from this category