STOCKS

News


ఐటీ ఫలితాలు ఓకే, కానీ..!

Thursday 11th April 2019
news_main1554962445.png-25064

ఈ వారాంతంలో ఇన్ఫీ, టీసీఎస్‌లు క్యు4 ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో నాలుగో త్రైమాసిక ఫలితాల సీజన్‌ ఆరంభం కానుంది. సాధారణంగా క్యు4ను ఐటీ కంపెనీలకు బలహీనమైన కాలంగా నిపుణులు భావిస్తారు. కానీ ఈసారి ఐటీ కంపెనీల ఫలితాల్లో రెవెన్యూ గ్రోత్‌ బలంగానే ఉంటుదని ఆనంద్‌ రాఠీ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. టీసీఎస్‌, ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా లాంటి బడా ఐటీ కంపెనీలు ఈ దఫా మంచి రెవెన్యూ వృద్ధి నమోదు చేస్తాయని తెలిపింది. బడా డీల్స్‌ గెలుచుకోవడం, రూపీ క్షీణత.. ఐటీ కంపెనీలకు కలిసివస్తాయని తెలిపింది. అయితే యూఎస్‌లో ఉద్యోగ నియామకాల కారణంగా వ్యయాలు పెరగడంతో మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడింది. దీంతో మార్జిన్లలో ఆశించిన మెరుగుదల ఉండకపోవచ్చని పేర్కొంది. మరోపక్క అంతర్జాతీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయని వ్యాఖ్యానించింది. కేంద్రబ్యాంకులన్నీ మందగమన భయంతో పాలసీలను సరళీకరిస్తున్నాయని తెలిపింది. మరోపక్క ఆయిల్‌ ధర క్రమంగా పెరుగుతోందని తెలిపింది. యూఎస్‌, చైనా మధ్య వాణిజ్యచర్చలు పాజిటివ్‌గా ముగిసే అవకాశాలున్న సంకేతాలున్నాయని, ఇందుకు సంకేతంగా బంగారం ధరలు అంతర్జాతీయంగా బలహీనపడుతున్నాయని పేర్కొంది. 
 



You may be interested

నిఫ్టీ 50 కంపెనీల లాభాలు.. అదుర్స్‌

Thursday 11th April 2019

-ఆదాయాలు మాత్రం అధ్వాన వృద్ధి -బ్యాంక్‌ల ఫలితాలు భేషుగ్గానే ఉండొచ్చు -మొండి బకాయిల ప్రభావం కొనసాగుతుంది -వినియోగ కంపెనీల జోరు -గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలపై విశ్లేషకుల అంచనాలు  నిఫ్టీ ఫిఫ్టీ సూచీలోని కంపెనీల గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు దుమ్మురేపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్‌లు  మంచి ఆర్థిక ఫలితాలను వెల్లడించే అవకాశాలు అధికంగా ఉన్నాయని,  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), యాక్సిస్‌ బ్యాంక్‌లు టర్నౌ అరౌండ్‌ కావడం దీనికి

అనుమతుల్లేకుండా కార్యకలాపాలెలా సాగిస్తోంది

Thursday 11th April 2019

- 'గూగుల్‌ పే' పై వివరణనివ్వాలంటూ ఆర్‌బీఐకి కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: నియంత్రణ సంస్థ అనుమతుల్లేకుండా మొబైల్ పేమెంట్ యాప్ 'గూగుల్‌ పే' (జీపే) ఆర్థిక లావాదేవీల నిర్వహణ ఎలా సాగిస్తోందన్నదానిపై వివరణనివ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ను, గూగుల్‌ ఇండియా సంస్థను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదావేసింది. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ చట్టానికి విరుద్ధంగా గూగుల్ పే సంస్థ పేమెంట్స్ సిస్టమ్ ప్రొవైడర్‌గా కార్యకలాపాలు సాగిస్తోందంటూ

Most from this category