STOCKS

News


స్టార్టప్‌లను ప్రోత్సహించాలి..!

Saturday 26th January 2019
Markets_main1548490082.png-23822

బీపీవో, కేపీవో సేవలకు పన్నుల్లో స్పష్టత అవసరం
ఏంజెల్‌ ట్యాక్స్‌ను రద్దు చేయాలి
కేంద్రానికి ఐటీ కంపెనీల సంఘం నాస్కామ్‌ వినతులు

న్యూఢిల్లీ: బీపీవో, కేపీవో సేవలను జీఎస్టీ కింద ఇంటర్‌మీడియరీలు (మధ్యవర్తిత్వ సంస్థలు)గా పరిగణిస్తున్నందున పన్ను నిబంధనల పరంగా స్పష్టత తీసుకురావాలని ఐటీ కంపెనీల సంఘం నాస్కామ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పరిశ్రమలో వృద్ధి రేటు మందగించినప్పటికీ... 2016 ఆర్థిక సంవత్సరం నుంచి 24 బిలియన్‌డాలర్ల ఆదాయాన్ని ఈ రంగం తెచ్చిపెట్టడమే కాకుండా నికరంగా ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేసింది. స్టార్టప్‌ల్లో చేసే పెట్టుబడులపై ఏంజెల్‌ ట్యాక్స్‌ పేరుతో విధిస్తున్న లెవీని ఎత్తివేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బడ్జెట్‌ ముందస్తు ప్రతిపాదనలను నాస్కామ్‌ కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది.
ఇంటర్‌మీడియరీలు కావు...
బీపీవో, కేపీవోలు సహా ఐటీ ఆధారిత సేవలను ఇంటర్‌మీడియరీలుగా రెవెన్యూ శాఖ పరిగణిస్తుండడంపై నాస్కామ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఈ అంశాన్ని సత్వరమే పరిష్కరించాల్సి ఉంది. బీపీవోలు, కేపీవో సంస్థలు ఇంటర్‌మీడియరీ సేవల పరిధిలోకి రావు’’అని నాస్కామ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ఆశిష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. సరఫరా ప్రదేశం, ప్రధాన కార్యాలయం, బ్రాంచ్‌ల లావాదేవీలు, సెజ్‌ కొనుగోళ్లనూ సత్వరమే పరిష్కరించాల్సిన అంశాలుగా నాస్కామ్‌ కోరింది. వ్యాపార సులభతరం కోసం ఇవి అవసరమని పేర్కొంది.
పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వాలి
స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు గాను ఏంజెల్‌ ట్యాక్స్‌ను రద్దు చేయాలన్నది నాస్కామ్‌ ప్రధాన డిమాండ్లలో మరొకటి. అంతేకాదు స్టార్టప్‌లకు రాయితీలు కూడా కల్పించాలని కోరింది. ‘‘ఏంజెల్‌ ఇన్వెస్టర్లు ఓ కంపెనీ ఆరంభ దశలో ఎంతో రిస్క్‌ తీసుకుని పెట్టుబడులు పెడుతుంటారు. కొత్త కంపెనీ ఆవిర్భవించి, వృద్ధి చెందేందుకు ఈ పెట్టుబడులు కీలకం. ఒకవేళ వీటికి రాయితీలు ఇవ్వకపోతే, కనీసం ప్రోత్సాహం అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని ఆశిష్‌ అగర్వాల్‌ వివరించారు. స్టార్టప్‌ల్లో పెట్టుబడుల లావాదేవీల విలువలో నిజాయితీ ఎంతుందంటూ తనిఖీ చేసే ప్రస్తుత విధానంలో లోపం ఉందన్నది నాస్కామ్‌ వాదన. ‘‘అన్‌లిస్టెడ్‌ కంపెనీల వ్యాల్యూషన్‌ ఎక్కువగా ఉంటుంది. స్టార్టప్‌ల విషయంలో ఇది ఇంకొచెం ఎక్కువ ఉంటుంది. కనుక ఈ వ్యాల్యూషన్‌ పరిధిని దాటి చూడాల్సిన అవసరం ఉంది. దేశంలో స్టార్టప్‌ల ఎకోసిస్టమ్‌ బలోపేతం చేసేందుకు, వీటి మనుగడ దృష్ట్యా ఈ అంశాన్ని సత్వరమే పరిష్కరించాలి’’ అని ఆశిష్‌ అగర్వాల్‌ సూచించారు. దేశంలో ఐటీ-బీపీవో పరిశ్రమ 167 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌తో 40 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న అంశాన్ని గుర్తు చేశారు.



You may be interested

మై జీనియస్‌ స్టార్‌లో నైపుణ్య శిక్షణ

Saturday 26th January 2019

- రూబిక్స్, అబాకస్, డ్రాయింగ్, హ్యాండ్‌ రైటింగ్‌ ట్రెయినింగ్‌ - ఫిబ్రవరిలో మార్కెట్లోకి యాప్‌; రూ.3 కోట్ల ఆదాయం లక్ష్యం - హైదరాబాద్, బెంగళూరులోని వందకు పైగా స్కూళ్లతో ఒప్పందం -  ‘స్టార్టప్‌ డైరీ’తో కంపెనీ ఫౌండర్‌ చవ్యా శివ నవ్య హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అబాకస్, క్యూబ్స్, ప్రొగ్రామింగ్‌ వంటి సాఫ్ట్‌ స్కిల్స్‌ నేర్చుకోవాలంటే? ప్రత్యేకంగా శిక్షణ కేంద్రానికెళ్లాలి లేదా హోమ్‌ ట్రెయినర్‌ను పెట్టుకోవాలి. కాకపోతే ఇలాంటివి మెట్రోల్లోనే దొరుకుతాయి. మరి, ద్వితీయ, తృతీయ

ఇండియన్ బ్యాంక్‌కు ప్రొవిజనింగ్ దెబ్బ..

Saturday 26th January 2019

- మొండిబాకీలకు 3 రెట్లు పెరిగిన కేటాయింపులు - క్యూ3లో సగానికి తగ్గిన లాభం న్యూఢిల్లీ: మొండిబాకీలకు ‍కేటాయింపులు పెరగడంతో.. ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సగానికి తగ్గి రూ. 152 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో బ్యాంక్ లాభం రూ. 303 కోట్లు. ఇక క్యూ3లో మొత్తం ఆదాయం రూ. 4,903 కోట్ల నుంచి రూ. 5,269

Most from this category