News


ఐటీ క్యు3 ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Tuesday 8th January 2019
news_main1546938621.png-23464

దేశీయ ఐటీ కంపెనీల క్యు3 ఫలితాల సీజన్‌ ఈ వారం ఆరంభం కానుంది. మూడో త్రైమాసికంలో ఐటీ కంపెనీలు మంచి ఫలితాలనే చూపవచ్చని, అయితే యూఎస్‌ వ్యాపారంలో కనిపిస్తున్న మందకొడితనం ఐటీ కంపెనీల గైడెన్స్‌పై ఉండొచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు యూఎస్‌ వ్యాపారం అప్‌మూవ్‌లో ఉండడం, బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో స్థిర వృద్ధి, రూపీ పతనం.. క్యు3లో ఐటీ కంపెనీలకు కలిసివస్తాయని భావిస్తున్నాయి.

క్యు3లో ఐటీ కంపెనీల సరాసరి రెవెన్యూ గైడెన్స్‌(స్థిర కరెన్సీ లెక్కల్లో) 1- 5 శాతం ఉండవచ్చని, బడా డీల్స్‌ కారణంగా గైడెన్స్‌ బాగుంటుందని బ్రోకింగ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. క్యు3లో ఉండే సీజనల్‌ బలహీనతలు కొనసాగినా దేశీయ ఐటీ కంపెనీలు మంచి వృద్ధి నమోదు చేయవచ్చని, వీటి సరాసరి కరెన్సీ తలనొప్పులు 50- 80 బీపీఎస్‌ వరకు ఉండొచ్చని సీఐఎంబీ అంచనా వేసింది. ఐటీ కంపెనీలకు ఈసారి కూడా బీఎఫ్‌ఎస్‌ఐ రంగం కామధేనువులా పనిచేస్తుందని తెలిపింది. పలు కంపెనీలు కుదుర్చుకున్న బడా డీల్స్‌ కంపెనీల ఫలితాలను మెరుగుపరుస్తాయని తెలిపింది.

ఎడెల్‌వీజ్‌ సైతం ఇదే అభిప్రాయం వెలుబుచ్చింది. డిజిటల్‌ విభాగంలో జోరు, బడా డీల్స్‌ కారణంగా రెవెన్యూ వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. టాప్‌ 5 ఐటీ కంపెనీల సరాసరి రెవెన్యూ వృద్ధి(స్థిర కరెన్సీ లెక్కల్లో) 2- 3.3 శాతం ఉండొచ్చని పేర్కొంది. డాలర్‌తో ఇతర ప్రధాన కరెన్సీల క్షీణత కారణంగా వచ్చే తేడా 40- 70 బీపీఎస్‌ ఉండొచ్చని తెలిపింది. ఇదే సమయంలో రూపీ బలహీనత కారణంగా మెరుగుదల 40- 60 బీపీఎస్‌ ఉంటుందని తెలిపింది. 
క్యు3లో కూడా ఐటీ కంపెనీల మార్జిన్ల విస్తరణ ఉండవచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు భావిస్తున్నాయి. వడ్డీవ్యయాల భారం ప్రథమార్ధంలోనే లెక్కలోకి వచ్చినందున ఈ త్రైమాసికంలో నిర్వహణా సామర్ధ్య మెరుగుదల కారణంగా మార్జిన్ల విస్తరణ కనిపించవచ్చని ఎడెల్‌వీజ్‌ తెలిపింది. టాప్‌5 ఐటీ కంపెనీల సరాసరి ఎబిటాలో 70- 100 బీపీఎస్‌ ఉండవచ్చని ఎడెల్‌వీజ్‌, 10- 30 బీపీఎస్‌ పెరుగుదల ఉండవచ్చని సీఐఎంబీ తెలిపాయి.

మేనేజ్‌మెంట్లు మార్జిన్‌అవుట్‌ లుక్‌పై చేసే కామెంట్లను నిశితంగా పరిశీలించాలని బ్రోకరేజ్‌ సంస్థలు చెబుతున్నాయి. యూఎస్‌ వ్యాపారంలో దోబూచులాడుతున్న మందగమన ఛాయల ప్రభావం ఈ కామెంట్లలో కనిపించవచ్చని భావిస్తున్నాయి. ఈ కామెంట్స్‌తో పాటు డీల్స్‌ వివరాలు, ఐటీ బడ్జెట్లు, బ్రెగ్జిట్‌, టారిఫ్‌లు, చైనా దిగుమతులు, ఐటీ వ్యయాలు, డిజిటల్‌ సేవల్లో మెరుగుదల, బీఎఫ్‌ఎస్‌ఐ అవుట్‌లుక్‌, యూరప్‌ రెవెన్యూ వృద్ధి రేటు, హైరింగ్‌, అట్రిషన్‌ తదితర విషయాలను కూడా నిశితంగా పరిశీలించాల్సిఉంది.

ఇన్ఫోసిస్‌ విషయంలో పూర్తి సంవత్సరపు గైడెన్స్‌ కొనసాగిస్తుందా? లేక తగ్గిస్తుందా? అనేది కీలకమని బ్రోకరేజ్‌లు భావిస్తున్నాయి. ఇన్ఫీతన గైడెన్స్‌ను పెంచవచ్చని మోతీలాల్‌ఓస్వాల్‌, సీఐఎంబీ భావిస్తుండగా, యథాతధంగా ఉంచుతుందని ఇతర బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. 


IT Q3

You may be interested

బంధన్ చేతికి గృహ్‌ ఫైనాన్స్‌

Tuesday 8th January 2019

- షేర్ల మార్పిడి రూపంలో విలీనం - విలీన సంస్థ విలువ సుమారు రూ. 83,000 కోట్లు - డీల్ జనవరి 1 నుంచి వర్తింపు  న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ తాజాగా గృహ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు  ప్రకటించింది. షేర్ల మార్పిడి రూపంలో ఈ విలీన ఒప్పందం ఉండనుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి జనవరి 1 నుంచి ఇది వర్తించనుంది.  ఇరు సంస్థల బోర్డులు సోమవారం ఈ

ఈ స్టాకుల్లో ఎంఏసీడీ బేరిష్‌ సిగ్నల్స్‌

Tuesday 8th January 2019

సోమవారం ముగింపు ప్రకారం 60 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారినకంపెనీల్లో ఐబీ హౌసింగ్‌. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, టాటా ఎలెక్సి, ఎల్‌ఐసీ హౌసింగ్‌, రైన్‌ ఇండస్ట్రీస్‌, విజయా బ్యాంక్‌, గృహ్‌ ఫైనాన్స్‌, వొక్‌హార్డ్‌, ఎంసీఎక్స్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, సీపీసీఎల్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, పీఎన్‌బీ గిల్ట్స్‌ తదితరాలున్నాయి.

Most from this category