STOCKS

News


ఖరీదైన ఆభరణాలు కొన్న వారి రిటర్నులు మళ్లీ మదింపు

Friday 13th July 2018
news_main1531503278.png-18301

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ సంస్థల నుంచి ఖరీదైన ఆభరణాలు కొన్న 50 మందికి పైగా అధిక విలువ కలిగిన వ్యక్తుల రిటర్నులను... మరోసారి తిరిగి మదింపు చేయాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. పీఎన్‌బీని రూ.13,000 కోట్లకు మోసగించి నీరవ్‌ మోదీ విదేశాలకు పరారైన విషయం తెలిసిందే. ఖరీదైన ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఉన్న ఆదాయ మార్గాలను తెలియజేయాలని నోటీసులు పంపినా గానీ... చాలా మంది తాము నీరవ్‌ మోదీ సంస్థలకు నగదు చెల్లింపులు చేయలేదని పేర్కొనడంతో తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వీరిలో కొందరు ఖరీదైన వజ్రాభరణాలను కొనుగోలు చేసి చెక్కు, కార్డు, నగదు రూపంలో విభజించి చెల్లింపులు చేశారనేందుకు ఆధారాలను సేకరించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. 



You may be interested

నాలుగేళ్లలో రూ.1,200 కోట్ల లక్ష్యం!

Friday 13th July 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోల్‌కతాకు చెందిన మహిళల పర్‌ఫ్యూమ్‌ బ్రాండ్‌ మెకెన్రో వచ్చే నాలుగేళ్లలో రూ.1,200 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యించింది. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.408 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నామని.. ఈ ఏడాది రూ.500 కోట్లను లక్ష్యించామని కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ (సీబీవో) సంజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు. శుక్రవారమిక్కడ మార్కెట్లోకి ‘సీక్రెట్‌ టెంప్టేషన్‌’లో రొమాన్స్, మిస్టరీ, అఫైర్, ప్లే, ఫ్యాషన్‌ కొత్త పరిమళాలను విడుదల చేశారు. అనంతరం ఆయన

అక్టోబర్‌ నుంచి డీబీఎస్‌ బ్యాంక్‌ సేవలు!!

Friday 13th July 2018

సింగపూర్‌: సింగపూర్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీబీఎస్‌ గ్రూప్‌.. భారత్‌లో బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించడానికి సిద్ధమౌతోంది. తమకు పూర్తి అనుబంధ సంస్థగా ‘డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా’ను (డీబీఎస్‌ ఇండియా) ఏర్పాటు చేయడానికి త్వరలో తుది ఆమోదం రానుందని, దీని ద్వారా బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి, అక్టోబర్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పీయుష్‌ గుప్తా తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన డీబీఎస్‌ ఆసియా 2018 సదస్సులో మాట్లాడారు.

Most from this category