STOCKS

News


ఏడాదిలో 10 ఐస్ప్రౌట్‌ సెంటర్లు

Saturday 1st December 2018
news_main1543644790.png-22555

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆఫీస్‌ వర్క్‌స్పేసెస్‌ రంగంలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ ఐస్ప్రౌట్‌... కొత్త నగరాలకు విస్తరిస్తోంది. 2019 మార్చిలో చెన్నైలో 210 సీట్ల సామర్థ్యం ఉన్న కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. పుణే, బెంగళూరు, గుర్గావ్‌లోనూ ఆరు నెలల్లో బిజినెస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.25 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు సంస్థ కో-ఫౌండర్‌ సుందరి పాటిబండ్ల ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధికి తెలిపారు. ఇటీవలే విజయవాడలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 సీట్ల సామర్థ్యం గల కార్యాలయాన్ని ప్రారంభించామని, 2019 డిసెంబరుకల్లా 10 సెంటర్లతో మొత్తం 7,000 సీట్ల సామర్థ్యానికి చేరుకోవాలన్నది లక్ష్యమని వెల్లడించారు. ‘హైదరాబాద్‌లో ఐస్ప్రౌట్‌కు 1.3 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 2,400 సీట్ల సామర్థ్యం గల బిజినెస్‌ సెంటర్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సీటింగ్‌ సామర్థ్యం పరంగా భారీ, ప్రీమియం బిజినెస్‌ సెంటర్‌ ఇది. ఇప్పటి వరకు రూ.25 కోట్లు వెచ్చించాం. భవిష్యత్‌ విస్తరణలో భాగంగా వాటా విక్రయం ద్వారా నిధులు సమీకరించాలన్నది మా ఆలోచన’ అని ఆమె వివరించారు.



You may be interested

రెరాలో నమోదు కాలేదా?

Saturday 1st December 2018

రూ.50 వేలు జరిమానా! సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, ఏజెంట్లూ! మీరు ఇంకా తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా)లో తమ పేర్లను, ప్రాజెక్ట్‌లను నమోదు చేయలేదా? అయితే రూ.50 వేలు జరిమానా చెల్లించాల్సిందే. పెనాల్టీ కట్టి వచ్చే వారం రోజుల్లోగా నమోదు చేసుకోకపోతే మొదటి వారం రూ.లక్ష, ఆ తర్వాతి వారం రూ.2 లక్షలు ఫైన్‌ తప్పదు. అప్పటికీ రిజిస్టర్‌ కాకపోతే ఏకంగా ప్రాపర్టీ సీజ్‌! కేంద్రం రియల్‌

అక్టోబర్‌లో మౌలిక రంగం మందగమనం

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్‌ అక్టోబర్‌లో నిరాశపరిచింది. కేవలం 4.8 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్‌ 2017లో ఈ రంగాల వృద్ధి రేటు 5 శాతం. అయితే నెలవారీగా చూస్తే  సెప్టెంబర్‌కన్నా అక్టోబర్‌లో వృద్ధిరేటు పెరిగింది. సెప్టెంబర్‌లో వృద్ధిరేటు 4.3 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో దాదాపు 40 శాతం వాటా ఉన్న ఈ రంగాల

Most from this category