STOCKS

News


ఎల్‌అండ్‌టీ ఇచ్చిన ఓపెన్‌ ఆఫర్‌ ధర ఓకేనా?!

Monday 1st April 2019
news_main1554113208.png-24907

మైండ్‌ట్రీలో మెజార్టీ వాటా సొంతం చేసుకునేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ ఓపెన్‌ఆఫర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్కో షేరుకు రూ. 980 చొప్పున ఎల్‌అండ్‌టీ ఆఫర్‌ చేయనుంది. అయితే కొంతమంది రిటైల్‌ ఇన్వెస్టర్లు, కొందరు సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం ఈ రేటుపై పెదవి విరుస్తున్నారు. ఎల్‌అండ్‌టీ తన ఆఫర్‌ను మరింత పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో షేరు ఒక్కింటికి రూ. 980 అంటే సరసమైన ధరేనని ఎక్కువమంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 2018-19 సంవత్సరానికి కంపెనీ ఈపీఎస్‌ సరాసరి అంచనా రూ. 45.9గా ఉంది. రూ. 980 చొప్పున కంపెనీ షేరు పీఈ 21.3 వద్ద ఉన్నట్లవుతుంది. దీంతో పీఈ పరంగా టీసీఎస్‌ తర్వాత మైండ్‌ట్రీ అత్యంత ఖరీదైనదిగా మారింది. అంతేకాకుండా పీఈ ముందస్తు అంచనాల ఆధారంగా నిఫ్టీ 50కి బయట అత్యంత విలువైన సాఫ్ట్‌వేర్‌ సంస్థగా మారింది. అందువల్ల రూ. 980 అనేది సరసమైన ధరగానే భావించాలని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ పేర్కొంది. ఒకవేళ అనుకున్నదానికన్నా ఎక్కువ వృద్ధిని రాబోయే కాలంలో నమోదు చేస్తే అప్పుడు ఈపీఎస్‌తో పాటు షేరు ధర కూడా మరింత పెరగవచ్చని, ఇప్పటికైతే రూ. 980 కరెక్ట్‌ ధరని తెలిపింది.

ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ తదితర మిడ్‌లెవల్‌ ఐటీ కంపెనీల పీఈ అంచనాలను ఆధారంగా చూసుకుంటే ఈ ధర గిట్టుబాటు ధరగానే భావించాలని ఐడీబీఐ క్యాపిటల్‌ అభిప్రాయపడింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు ఈ ధర అనువైనదని జాయిన్‌డ్రే క్యాప్‌సర్వ్‌ తెలిపింది. కంపెనీ ప్రమోటర్లు ఎల్‌అండ్‌టీకి ఎదురునిలిచి ఉండలేరని, ఈ నేపథ్యంలో సంస్థాగత వాటాదారులు ఎల్‌అండ్‌టీకి మద్దతుగా మారితే అప్పుడెలాగైనా రిటైల్‌ మదుపరులు అదే బాట పట్టక తప్పదని అభిప్రాయపడింది. 



You may be interested

కొత్త ఆర్థిక సంవత్సరంలో రికార్డులతో బోణి

Monday 1st April 2019

11650పైన ముగిసిన నిఫ్టీ ఇంట్రాడేలో కొత్త జీవితకాల గరిష్టానికి సెన్సెక్స్‌  స్టాక్‌ మార్కెట్‌ కొత్త ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్‌ రోజున లాభాలతో ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,115 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ నిఫ్టీ 30,648.10 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సానుకూల అంతర్జాతీయ పరిణామాలు, దేశీయా మార్కెట్‌లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వెల్లువ, ఈ వారంలో జరిగే ఆర్‌బీఐ సమీక్షా సమావేశాల అనంతరం కీలక వడ్డీరేట్లపై పావు రేటు

రూ.1400 దాటిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Monday 1st April 2019

దేశీయ ప్రైవేట్‌ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు సోమవారం మరో కొత్త గరిష్టస్థాయిని నమోదు చేయడంతో పాటు రూ. 1,400 స్థాయిని దాటాయి. నేడు బీఎస్‌ఈలో రూ.1368.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ షేరు నేటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో 2.8శాతం లాభపడి రూ.1406.80 రికార్డుస్థాయిని తాకింది. ఇది ఈ షేరుకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం 2 గంటలకు షేరు గత ముగింపు(రూ.1363.05)తో పోలిస్తే 2.50శాతం లాభంతో రూ.1395.60ల వద్ద

Most from this category