STOCKS

News


టాటామోటర్స్‌ షేరును ప్రస్తుతం కొనొచ్చా?

Wednesday 24th April 2019
news_main1556112051.png-25321

బుధవారం ట్రేడింగ్‌లో టాటామోటర్స్‌ షేరు దాదాపు 4 శాతం పతనమైంది. దీంతో వరుసగా మూడో సెషన్లో కూడా షేరు డౌన్‌ట్రెండ్‌ కొనసాగించినట్లయింది. నిజానికి గత కొన్నాళ్లుగా ఈ షేరు అనూహ్య అప్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. ఈ ఏడాది ఇంతవరకు షేరు దాదాపు 34 శాతం ర్యాలీ జరిపింది. గతేడాది మే అనంతరం షేరు దీర్ఘకాలిక పతనావస్థలోకి జారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడాది కనిష్ఠస్థాయి రూ.142ను తాకింది. అయితే అక్కడనుంచి ఒక్కమారుగా పరుగు ఆరంభించి 63 శాతం లాభంతో రూ. 230 స్థాయిలను చేరింది. ఇప్పుడు మరలా వరుసగా మూడు రోజులు పతనమై ఇన్వెస్టర్‌ను డైలమాలో పడేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ షేరును కొనొచ్చా? ఉన్న షేర్లలో ప్రాఫిట్‌ బుకింగ్‌ చేయాలా? అని రిటైలర్స్‌ డైలమాలో పడ్డారు. 
నిపుణులేమంటున్నారు?
- టాటామోటర్స్‌కు సంబంధించి నెగిటివిటీ మొత్తం ప్రైస్‌ఇన్‌ అయిందని ఐఐఎఫ్‌ఎల్‌ ప్రతినిధి సంజీవ్‌ భాసిన్‌ అభిప్రాయపడ్డారు. ఇకపై కంపెనీకి సంబంధించిన పాజిటివ్‌ అంశాలు ప్రభావం చూపుతాయన్నారు. యూఎస్‌, చైనా వాణిజ్యయుద్ధం ముగిసిపోయే సూచనలు కనిపించడం, చైనా ఎకానమీలో ఉద్దీపనలు ప్రవేశపెట్టడం వంటివి కంపెనీకి మేలు చేస్తాయన్నారు. దీనికితోడు బ్రెగ్జిట్‌కు సంబంధించి పౌండ్‌లో వచ్చిన కదలికలు కంపెనీకి సానుకూలంగా మారాయన్నారు. ఏడాది ద్వితీయార్ధంలో దేశీయ వాహన విక్రయాలు సైతం పుంజుకునే ఛాన్సులున్నాయన్నారు. అయితే షేరులో ఆటుపోట్లను ఎవరూ అంచనా వేయలేమని, అందువల్ల ఈ షేరుపై సిప్‌ పద్దతిలో పెట్టుబడి పెట్టడం మంచిదని సూచించారు. 
- షేరులో మరింత అప్‌మూవ్‌ దాగిఉందని టార్గెట్‌ ఇన్వెస్టింగ్‌ ప్రతినిధి సమీర్‌ కల్రా అంచనా వేశారు. ఫిబ్రవరిలో వచ్చిన రూ. 150 స్థాయి చాలామంచి కొనుగోలు అవకాశమని, సమీప భవిష్యత్‌లో ఈ ఛాన్స్‌రాదని చెప్పారు. కంపెనీకి సంబంధించి నెగిటివ్‌ వార్తల ప్రభావం ముగిసిపోయిందని, ఇకపై పాజిటివ్‌ వార్తల ప్రభావం కనిపిస్తుందని తెలిపారు. ప్రమోటర్లు కంపెనీలో వాటాలు పెంచుకోవడం ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచిందన్నారు.
- టాటామోటర్స్‌ రెవెన్యూలో సింహభాగం ఎగుమతుల వల్ల వస్తోందని, అందువల్ల షేరు కొనుగోలుపై ఆచితూచి వ్యవహరించాలని ఐడీబీఐ క్యాప్‌ ప్రతినిధి ప్రభాకర్‌ చెప్పారు. కంపెనీ మూడు ఖండాల్లో వ్యాపారం చేస్తున్నందున సంపూర్ణ అధ్యయనం చాలా క్లిష్టమన్నారు. అందువల్ల ఈ సమయంలో షేరుకు దూరంగా ఉండాలని సూచించారు. షేరులో మరోమారు నాణ్యమైన కరెక‌్షన్‌ వచ్చిన అనంతరం ఎంటర్‌ కావాలని సలహా ఇచ్చారు. You may be interested

మధ్యకాలానికి మార్కెట్లు భేష్‌: గౌతమ్‌షా

Wednesday 24th April 2019

మన ఈక్విటీ మార్కెట్లు మధ్య కాలానికి (మీడియం టర్మ్‌) చాలా బలంగా కనిపిస్తున్నాయని జేఎం ఫైనాన్షియల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌, టెక్నికల్‌ అనలిస్ట్‌ గౌతమ్‌షా అంటున్నారు. స్వల్ప కాలంలో మాత్రం నిఫ్టీ విరామంలో ఉందన్నారు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. నిఫ్టీ 10,600 పాయింట్ల నుంచి 11,800 పాయింట్లకు కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే చేరుకుందన్నారు.  స్వల్ప వ్యవధిలోనే 1,200 పాయింట్లు పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కొత్తగా కొందామా? ఉన్నవి అమ్మేద్దామా?

Wednesday 24th April 2019

మార్కెట్లో రిటైలర్‌ ఇన్వెస్టర్‌ డైలమా వేచిచూడమంటున్న నిపుణులు నిఫ్టీ చాలా స్వల్పకాలంలో దాదాపు వెయ్యి పాయింట్లకు పైన ర్యాలీ జరిపింది. ఏప్రిల్‌ ఎక్స్‌పైరీ దగ్గరపడుతున్న సమయాన నిఫ్టీ దాదాపు 11750 పాయింట్లకు చేరువైంది. ఒకపక్క వీఐఎక్స్‌ సూచీ అంతకంతకూ పెరిగిపోతున్నా... బుల్స్‌ మాత్రం మార్కెట్‌పై పట్టు సడలించడంలేదు. దీంతో ర్యాలీ ఉంటుందని కొత్త కొనుగోళ్లు చేయాలా? వీఐఎక్స్‌ పెరిగిపోతోందని ఉన్న  పొజిషన్లను విక్రయించి లాభాలు స్వీకరించాలా? అని రిటైల్‌ ఇన్వెస్టర్‌ డైలమాలో పడుతున్నాడు.

Most from this category