STOCKS

News


ఐపీఓ..యూపీఐ గడువు పొడిగింపు

Thursday 4th April 2019
news_main1554374362.png-24979

జూన్‌ 30 వరకూ పొడిగించిన సెబీ 
న్యూఢిల్లీ: ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)లో షేర్లకు  యూపీఐ(యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ద్వారా దరఖాస్తు చేయడానికి సంబంధించిన తొలి దశ గడువును సెబీ  పొడిగించింది. ఐపీఓలో షేర్ల కోసం దరఖాస్తు చేయడానికి ప్రత్యామ్నాయ మార్గంగా యూపీఐ విధానాన్ని సెబీ అందుబాటులోకి తేనున్నది. దీనికి సంబంధించిన తొలి దశ గడువును ఈ ఏడాది జూన్‌ 30 వరకూ పొడిగించామని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ తెలిపింది. దీనికి సంబంధించిన రెండో, మూడో దశ గడవుల్లో ఎలాంటి పొడిగింపు లేదని స్పష్టం చేసింది.


సగం తగ్గనున్న లిస్టింగ్‌ సమయం 
ఐపీఓలో షేర్లకు దరఖాస్తు చేయడానికి ప్రత్యా‍మ్నాయ మార్గంగా యూపీఐను ఈ ఏడాది జనవరి 1 నుంచి దశల వారీగా అందుబాటులోకి తేనున్నట్లు గత ఏడాది నవంబర్‌లోనే సెబీ ప్రకటించింది. ఈ విధానం కారణంగా ఐపీఓకు వచ్చిన కంపెనీ స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే సమయం సగానికి తగ్గుతుంది. ప్రస్తుతం ఐపీఓ పూర్తయిన తర్వాత ఆరు రోజులకు సదరు కంపెనీ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతాయి. సెబీ కొత్త విధానం వల్ల ఈ లిస్టింగ్‌ సమయం ఆరు రోజుల నుంచి మూడు రోజులకు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ విషయంలో మానవ ప్రమేయం తొలగి, ప్రస్తుత వ్యవస్థ సామర్థ్యం మరింత మెరుగవుతుందని పేర్కొంది. ప్రస్తుతం రిటైల్‌ ఇన్వెస్టర్లు బ్యాంక్‌ ఆస్బా(అప్లికేషన్‌ సపోర్టెడ్‌ బై బ్లాక్‌ అమౌంట్‌), లేదా బ్రోకర్‌ ఆస్బా ద్వారా ఐపీఓ షేర్లకు దరఖాస్తు చేస్తున్నారు. బ్రోకర్లు ఈ దరఖాస్తులను ఇన్వెస్టర్‌ బ్యాంక్‌లకు సమర్పిస్తారు. ఇక కొత్త యూపీఐ విధానంలో బ్యాంక్‌లకు దరఖాస్తు సమర్పణ వంటి మానవ ప్రమేయపు కార్యకలాపాలు ఉండవు.
యూపీఐ అంటే..
 నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌​ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) యూపీఐ పేరుతో ఇన్‌స్టంట్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఈ విధానంలో ఇరు వ్యక్తులు, బ్యాంక్‌ ఖాతాల మధ్య తక్షణం నగదు బదిలీ జరుగుతుంది. 



You may be interested

ఎఫ్‌ఐఐలు కొంటుంటే... డీఐఐలు అమ్మడం ఎందుకు?

Thursday 4th April 2019

ఆర్‌బీఐ నుంచి ఈ ఏడాది రెండో సారి రేట్ల కోత ఉంటుందన్న అంచనాలతో ఈక్విటీ మార్కెట్లు ఆల్‌టైమ్‌ గరిష్టాలకు చేరాయి. అయితే, ఇక్కడ మాత్రం ఇన్వెస్టర్ల విషయంలో వైరుధ్యాన్ని గమనించొచ్చు. ఆసియాలోనే విదేశీ ఇన్వెస్టర్లకు గమ్యస్థానంగా మారిన మన ఈక్విటీల్లో స్థానిక మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌ కంఎనీలు షేర్లను విక్రయిస్తున్నాయి.    దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు మార్చి నెలలో 13,930 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. మూడేళ్ల కాలంలో ఇదే అత్యధికం. కానీ,

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో బీమా, ఎంఎఫ్‌ సేవలు

Thursday 4th April 2019

- జూన్‌ నుంచి ప్రారంభం న్యూఢిల్లీ: ఈఏడాది జూన్‌ నుంచి మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్, రిస్క్‌-ఫ్రీ బీమా సేవలను ప్రారంభించనున్నట్లు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఈ అంశంపై సంస్థ ఎండీ, సీఈఓ సతీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. ‘ఇందుకు సంబంధించి ఇటీవలే ఆర్‌బీఐ నుంచి అనుమతి లభించింది. సేవలను అందించేందుకు భాగస్వాములతో చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత త్రైమాసికం చివరినాటికి ఈ సేవలను అందించాలని భావిస్తున్నాం. జూన్‌లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం

Most from this category