STOCKS

News


ఐపీవో ఫైనాన్సింగ్‌ కంపెనీలకు చేదు వార్తే!

Thursday 20th September 2018
news_main1537385194.png-20395

గతేడాది మొదట్లో డీమార్ట్‌ పబ్లిక్‌ ఇష్యూ నాటికి ఐపీవో ఫైనాన్స్‌ మార్కెట్‌ పొంగుమీద ఉంది. కానీ, ఆ తర్వాత చూస్తే అప్పటి నుంచి తగ్గుముఖం పట్టింది. తాజాగా ఐపీవో లిస్టింగ్‌ కాల వ్యవధిని సెబీ కుదించడం ఐపీవో ఫైనాన్స్‌ మార్కెట్‌కు మరింత చేదు వార్తేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 

 

ఐపీవో ఫండింగ్‌ అన్నది ఐపీవోలో షేర్లకు దరఖాస్తు చేసుకునే వారికి ఇచ్చే రుణం. ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు రిటైల్‌, అధిక నెట్‌వర్త్‌ కలిగిన వ్యక్తులకు, కార్పొరేట్‌ సంస్థలకు ఈ రుణాలను ఇస్తుంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు రూ.2 లక్షల వరకు ఐపీవోలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఐపీవోకు అవసరమైన మొత్తంలో ఇన్వెస్టర్‌ స్వల్ప మొత్తం సమకూర్చుకుంటే, మిగిలిన మేర ఫైనాన్స్‌ కంపెనీలు సమకూర్చుతాయి. ఐపీవో ముగిసిన తర్వాత సదరు కంపెనీ స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో మంచి ప్రీమియంతో లిస్ట్‌ అయితే షేర్లు అలాట్‌ అయిన వారికి మంచి రాబడులు అందుతాయి. దీంతో తీసుకొచ్చిన రుణానికి వడ్డీ చెల్లింపులు పోను తనకు పెద్ద మొత్తంలోనే లాభాలు మిగులుతాయి. మోస్తరు లిస్టింగ్‌ అయినా కొంత వరకు లాభాన్ని పొందొచ్చు. అంటే ఒక విధంగా ప్రీమియంతో లిస్ట్‌ అయితేనే అప్పుపై షేర్లను పొందిన వారు, తాను నష్టపోకుండా వడ్డీ చెల్లింపులు చేయగలరు. మరోసారి ఫైనాన్స్‌ కోసం ముందుకు రాగలరు. కానీ, లిస్టింగ్‌ నిరాశపరిస్తే కనీసం వడ్డీ చెల్లింపులకు సరిపడా ఖర్చులు కూడా రాని పరిస్థితి ఎదురవుతుంది.

  

సాధారణంగా ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు ఏడు రోజులకు గాను క్లయింట్ల నుంచి 7-8 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంటాయి. బుల్‌ మార్కెట్‌ సమయాల్లో లిస్టింగ్‌ లాభాలపై అధిక అంచనాలు ఉంటాయి కనుక ఐపీవో ఫండింగ్‌ ఆ సమయంలో ఊపందుకుంటుంది. దీంతో ఆ సమయంలో డిమాండ్‌ కూడా పెరిగి స్టాక్‌ ధరల పెరుగుదలకూ దారితీస్తుంది. షేర్ల కేటాయింపు తర్వాత నుంచి మూడో రోజు వాటిని స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్‌ చేయాల్సి ఉంటుందని ఈ నెల 18న సెబీ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కాల వ్యవధి ఆరు రోజులుగా ఉంది. అయితే, ఇది ఐపీవో ఫైనాన్స్‌ కంపెనీలకు లాభమా, నష్టమా? అంటే... ఇప్పటి వరకు ఏడు రోజులకు రుణం అవసరం కాగా, ఇకపై మూడు నాలుగు రోజులకే దీని అవసరం ఉంటుంది. మరి ఇంత తక్కువ రోజులకు ఫైనాన్స్‌ అవసరం ఉంటుందా? లేదా అన్నదానిపై సందేహం నెలకొంది. ఈ విషయంలో ఫైనాన్షియర్లలోనూ స్పష్టత లేదు. అయితే, మంచి ఇష్యూ అయి ఉండి, బాగా ఆదరణ ఉంటే, అధిక లిస్టింగ్‌ లాభాలకు అవకాశం ఉంటే రుణాలు తీసుకునేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపొచ్చు. ఇటీవలి కాలంలో కంపెనీల లిస్టింగ్‌ గెయిన్స్‌ అవకాశాలు చాలా వరకు తగ్గడాన్ని గమనించొచ్చు. మరోవైపు స్వల్ప కాలం కోసం ఫైనాన్స్‌ కంపెనీలు నిధుల సమీకరించడం అధిక వ్యయానికి దారితీస్తుంది. ఏడు రోజుల కోసం అవి నిధుల్ని సమీకరిస్తే... సెబీ తాజా ఆదేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు నాలుగు రోజులకే రుణం తీసుకుంటే, మరో మూడు రోజుల పాటు సంబంధిత నిధులపై లాభాలను పొందే మార్గాన్ని అవి గుర్తించాల్సి వస్తుందని నిపుణుల అభిప్రాయం. అయితే, ఇన్వెస్టర్లు నాలుగు రోజులకే రుణం తీసుకున్నా గతంలో మాదిరిగా వ్డీ రేటును తగ్గించకుండా ఏడు రోజుల స్థాయిలో వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అది ఎంత వరకు ఫలితమిస్తుందన్నది చూడాల్సిందే.You may be interested

నేడు మార్కెట్లకు సెలవు

Thursday 20th September 2018

మొహర్రం సందర్భంగా నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. వీటితోపాటు కమోడిటీ, బులియన్‌, మెటల్‌, ఫారెక్స్‌, కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్లకు సైతం సెలవు. స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్‌ తిరిగి యథావిధిగా శుక్రవారం(21న) ఉదయం 9.15కు ప్రారంభంకానుంది. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో షేర్లలో నెలకొన్న అమ్మకాలతో బుధవారం సెన్సెక్స్‌ 169 పాయింట్ల నష్టపోయి 37,121 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల నష్టపోయి 11,234 వద్ద ముగిశాయి. ఈ వారంలో

రూపాయి బలహీనతతో మోదం... ఖేదం?

Thursday 20th September 2018

దేశీయ కరెన్సీ రూపాయి డాలర్‌తో 72 స్థాయిలకు పడిపోగ... కొంత కాలం పాటు రూపాయి రికవరీ కాకపోవచ్చని, 73-74 స్థాయికి పడిపోయే అవకాశం కూడా ఉందని పుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 3 శాతం మార్క్‌ను దాటడం, దేశీయంగా కరెంటు ఖాతా లోటు పెరగడం, పెరుగుతున్న ముడి చమురు ధరలు రూపాయికి నష్టం చేకూర్చే అంశాలుగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్పెక్యులేటర్లను నిరోధించేందుకు ఆర్‌బీఐ

Most from this category